
కుటుంబానికి చేయూత కల్పించడా నికి తోడ్పాటు అందించడం చాలా గొప్ప
ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు రాక ఇంటి పట్టున ఖాళీగా ఉండకుండా చిన్న తరహా పరిశ్రమలు లాంటివి స్థాపించుకొని తాను ఉపాధి పొందడమే కాక పదిమందికి ఉపాధి కల్పించి వారి కుటుంబానికి చేయూత కల్పించడా నికి తోడ్పాటు అందించడం చాలా గొప్ప విషయమని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి ప్రతిక్ జైన్ అన్నారు
మణుగూరు మండలంలోని కొత్త కొండాపురం గ్రామానికి చెందిన నిరుద్యోగ గిరిజన యువకుడు కోడి నాగరాజు గిరిజన యువకుడు మిత్రుల సహాయముతో 16 లక్షల రూపాయల వ్యయంతో సొంతంగా నిర్మించుకున్న సేంద్రీయ పద్ధతులతో నాటు కోళ్ల పెంపకం కోళ్ల ఫారాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత చదువులు చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూడకుండా స్వశక్తితో తన కాళ్లపై తాను నిలబడి సొంతంగా వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకోవడమే కాక పదిమందికి ఉపాధి కల్పించడం కొరకు మిత్రులు అండదండలతో 16 లక్షల రూపాయలు సేకరించి సొంతంగా సేంద్రియ పద్ధతులతో నాటు కోళ్ల పెంపకం మరియు పండ్లు కూరగాయలు పండించి వాటిని అమ్మి ఆర్థికంగా అభివృద్ధి చెందడం శుభపరిణామని గ్రామస్తులు కూడా ఇతనిని స్ఫూర్తిగా తీసుకొని మీకు నచ్చిన చిన్న తరహా పరిశ్రమలను స్థాపించుకొని జీవనోపాధి పొందాలని ఆయన అన్నారు. అనంతరం గ్రామస్తుల సమక్షంలో హరితహారం లో భాగంగా మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని అలాగే ఎక్కువ శాతం గిరిజనులే ఉన్నందున ఇప్పపువ్వు సంబంధించిన మొక్కలను నాటి ఆర్థికంగా అభివృద్ధి చెంది తమ కుటుంబాలను పోషించుకోవాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మణుగూరు తాసిల్దార్ రాఘవరెడ్డి విద్యుత్ శాఖ ఏఈ వేణుగోపాల్ సబ్ ఇంజనీర్ లారెన్స్ పిసా చట్టం కోఆర్డినేటర్ అనిల్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.