
పెదాకాకానీ మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన తాడిపోయిన తాతారావు యాదవ్ చిన్నతనం నుంచే ఉప్పలపాడులోనే ఉంటూ అక్కడే స్థిరపడ్డారు. చిన్నతనంలో గ్రామస్తులు సాంఘిక నాటకాలు ప్రదర్శిస్తుంటే పుస్తకంలో డైలాగులు చెప్పడానికి వెళ్లేవారు. అలా నాటకాలపై మమకారం పెంచుకొని ఐదో తరగతి లోనే శ్రీప్ట్ లు రాసి తోటి విద్యార్థులతో నాటకాలు వెయిస్తుండేవారు. అలా డిగ్రీ చేసేనాటికి రచన దర్శకత్వం వహించే స్థాయికి ఎదిగినారు .పలు స్టేజిలపై అనేక సన్మానాలు చేయించుకున్నారు.1998 లో తొలిసారిగా నువ్వు వస్తవాన్ని నాటకంలో తన రచనలు ప్రారంభించి 2000 సం లో మునగాల మండలం రేపాల గ్రామంలో తొలిసారిగా ప్రదర్శిచి ప్రేక్షకుల మెప్పు పొందారు.అప్పటికే సాంఘిక నాటక రచయితలుగా రాణిస్తున్న ఎందరినో ఆదర్శంగా తీసుకొని మరిన్ని రచనలు చేశారు……..
కళ అనేది మనసుతో చూసి కళ్ళతో పలికించే గొప్ప నైపుణ్యము.అందుకే ఆయన నాటకరంగం అనే కళను మనసుతో సృజించారు.సమాజాన్ని కళ వస్తువుగా తీసుకొని రచనకు పదునుపెట్టారు.తన కాలంతో పాత్రలకు జీవం పోసి కళాకారుల ను తయారు చేసాడు. అవసరమైన చోట మొఖానికి మేకప్ అద్దుకొని నాటకాన్ని రక్తి కట్టించాడు.తన రచనలకు స్వీయ దర్శకత్వం వహించి ప్రేక్షకుల కరతాల ధ్వనుల మధ్య ఒన్స్ మోర్ ప్లీజ్ అనిపించుకున్నారు.ఇలా కళకు ఊపిరిపోస్తూ కళాకారుల ను ప్రోత్సహిస్తూ కళ్ళమ్మతల్లి పొందుతున్నారి తాత రావు యాదవ్………
తాతారావు రచనలు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ..రాష్ట్రంలో జిల్లాలలో ఎక్కడ ఏ సాంఘిక నాటకం ప్రదర్శించిన తాతారావు యాదవ్ రచన ఉంటుంది.ఇప్పటివరకు 60 రచనలు చేశారు ఇవ్వని ప్రదర్శించడం జరిగింది.వాటిలో కొన్ని నాటకాలు పేర్లు…. నువ్వే కావాలి. నువ్వు వస్తవని , సింహాద్రి, శంకర దాదా ,ఉగ్రసింహాలు, ఛత్రపతి,విక్రమార్కుడు, పోకిరి,యుగంధర్,చిరుతపులి, అమర ప్రేమ,కత్తిలాంటి కుర్రాళ్ళు,రెబల్స్,పులిపంజా,కాల రుద్రుడు వీర భద్రుడు,రౌడి సింహ పోలీస్ పులి,పులివెందుల సింహాలు,లెజెండ్ ,యువగర్జన ,దూకుడు,న్యూ సర్ధార్ ,టైగర్ డేగ,పల్నాటి రక్తం,పల్నాటి గర్జన, టైగర్ సింహ,రౌడి బుల్లెట్, రౌడీ సింహాలు,కాటమ రాయుడు,సింహ,బద్రి నాద్ ఇలా అనేక నాటకాలు రాసి గుర్తింపు తెచ్చుకున్నారు.ఛత్రపతి నాటకం బాగా గుర్తింపు తెచ్చింది…రచించిన ఛత్రపతి నాటకం..2010 లో శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మలిలో 3 రోజులు ప్రదర్శించారు దీనికి గాను ఉత్తమ రచయిత అవార్డు వచ్చింది. ప్రస్తుతం టైగర్ బుల్లెట్ టైగర్ విక్రమ్ టైగర్ బెబ్బులి రౌడీ దర్భార్ నాటకాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రదర్శింపబడుతున్నాయి…..ఈ 20 సం నుండి 100 నాటకాలకు దర్శకత్వం వహించాను రచయిత గా ఆదాయం రాకపోయినా నేను నాటిన ఒక్క నాటకం ప్రదర్శిస్తే ప్రత్యేకంగా 50 మందికి పరోక్షంగా100 మంది కళాకారులకు ఉపాధి లభిస్తుంది. నా రచనలు వల్ల వారు ఉపాధి పొందుతున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది…..
సాంఘిక నాటక రంగంలో రాణిస్తున్న యాదవ్ నటుడిగా రచయితగా దర్శకుడిగా రాష్ట్ర వ్యాప్తిగా గుర్తింపు…రచించిన అన్ని నాటకాలు స్టేజిపైకి.సాంఘిక నాటక రంగంలో అత్యధిక సాంఘిక నాటకాలు రచించిన యువ రచయిత……
పొనుగోటి రంగా, గ్రామ వెలుగు నాట్య మండలి అధ్యక్షులు,రేపాల మరియు
తెలంగాణ నాటక సమాజల సమాఖ్య మునగాల మండల అధ్యక్షులు