
నానో యూరియా వాడకం పెంచాలి-ఎమ్మెల్యే రేవూరి
రైతులకు యూరియా కొరతా రాకుండా చర్యలు చేపట్టాలి అని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. హనుమకొండ భవాని నగర్ లోని తన నివాసంలో గీసుగోండ,సంగెం,ఖిలా వరంగల్ మండలాల వ్యవసాయ శాఖ అధికారులతో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు.నానో యూరియా వాడకం పెంచాలి అని, నానో యూరియా పై రైతులలో అవగాహన కల్పించాలని అన్నారు.అలాగే యూరియా పంపిణీని పూర్తిగా పర్యవేక్షించి, దళారులు లేదా అక్రమ రవాణా లాంటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వరంగల్ ఏడిఏ నర్సింగం, గీసుగోండ,సంగెం,ఖిలా వరంగల్ మండలాల ఏవోలు,ఏఈవోలు, సొసైటీ సీఈవోలు, ప్రైవేట్ కంపెనీల డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.