నామినేషన్ కేంద్రాలను తనిఖీ చేసిన రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు
ఎన్నికల అధికారి శ్యామ్ ప్రసాద్ లాల్ ఐఏఎస్. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మునిసిపల్ కేంద్రం లోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించరు, ఈ సందర్భంగా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లు, పార్కింగ్, త్రాగునీటి వసతి, విద్యుత్ సరఫరా తదితర అంశాలను అధికారులు సమీక్షించారు. అభ్యర్థులు మరియు వారి ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. నిబంధనల ప్రకారం నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ పారదర్శకంగా, క్రమబద్ధంగా జరగాలని ఆదేశించారు.మొదటి రోజున జనసేన పార్టీ అభ్యర్థి బోడ స్వాతి దామోదర్ 6 వార్డు నుండి నామినేషన్ దాకలు చేసారు, కాంగ్రెస్ పార్టీ నుండి బర్మావత్ దేవి రాంసింగ్ 9 వార్డు నామినేషన్ దాకలు చేసారు, ఈ కార్యక్రమంలో మరిపెడ తహసీల్దార్ కృషవేణి, మునిసిపల్ కమిషనర్ విజయనంద్, పురపాలక సంఘం ఎన్నికల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.