నారాయణలో రాజ్యాంగ విలువల గూర్చి బోధన
గణతంత్ర దినోత్సవ వేడుకలను సత్తుపల్లి పట్టణంలోని నారాయణ ఈ.ఎం. స్కూల్లో 76వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఏ. జి.ఏం. సర్ మరియు ప్రిన్సిపాల్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. వారు గణతంత్ర దినోత్సవ ప్రాముఖ్యతను వివరించడంతో పాటు, భారత రాజ్యాంగంలోని విలువలు, దేశభక్తి, క్రమశిక్షణ వంటి అంశాల అవసరాన్ని విద్యార్థులకు తెలిపారు.
ఈ వేడుకలలో భాగంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు, నృత్యాలు, ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారులు దేశభక్తి అంశాలతో ఫ్యాన్సీ డ్రెస్ ధరించి స్వాతంత్ర్య సమరయోధులు మరియు జాతీయ నాయకుల వేషధారణలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు మరియు సిబ్బంది విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు భవిష్యత్తులో దేశానికి సేవ చేసే బాధ్యతగల పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమం విద్యార్థుల్లో దేశభక్తి భావాలను మరింత బలపరిచింది.