
నా బలం నా బలగం అంతా నీతి నిజాయితే - శ్రీ కడియం శ్రీహరి
వేలేరు మండలం సోడషపల్లి గ్రామం నందు బి.అర్.ఎస్ పార్టీ గ్రామ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ బి.అర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి, యం.ఎల్.సి శ్రీ కడియం శ్రీహరి మాట్లాడుతూ..
మీకు సేవ చేసుకునే భాగ్యం కల్పించాలని అన్నారు. మీరు ఆశీర్వదించిన ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి సాగునీరు అందిస్తానన్నారు. సంవత్సరం లోపల మండల కాంప్లెక్స్ ను పూర్తి చేసుకుందామన్నారు. తెలంగాణ కొరకు బొంత పురుగును కూడా ముద్దు పెట్టుకుంటా అని శ్రీ కేసీఆర్ అన్నారని శ్రీ కడియం శ్రీహరి తెలిపారు. అందరం కలిసి మూడోసారి శ్రీ కెసిఆర్ ని ముఖ్యమంత్రిని చేసుకుందామన్నారు. నిత్యం మీకు అందుబాటులో ఉంటూ మీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటానన్నారు. శ్రీ కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత సీఎంగా పదేళ్ల పరిపాలనలో దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలు ఇక్కడ అమలు చేశారన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు.ఈ కార్యక్రమంలో యం.ఎల్.సి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి , యం.ఎల్.ఎ డా. తాటికొండ రాజయ్య, ఎనుగుల రాకేష్ రెడ్డి , యం.పి.పి సమ్మిరెడ్డి, జెడ్.పి.టి.సి సరిత, మండల పార్టీ అధ్యక్షులు నర్సింగరావు, సర్పంచ్ కొట్టే రాజేష్, గ్రామ పార్టీ అధ్యక్షులు శ్రీను, ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.