
* మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్
- మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్
గళం న్యూస్ డోర్నకల్:-
ఎంతోమంది కార్యకర్తలను ప్రజాప్రతినిధులుగా గెలిపించాను నా వెంట ఉన్న కార్యకర్తలను వార్డు నెంబర్లుగా ఎంపీటీసీ సభ్యులుగా మండల ప్రజా ప్రతినిధులుగా జడ్పిటిసిలుగా సర్పంచులుగా మున్సిపాలిటీ చైర్మన్గా గెలిపించాను మాజీ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యా నాయక్ తెలిపారు. డోర్నకల్ జైన్ భవన్ లో మంగళవారం బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నన్ను కాదని బిఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిపోయే నాయకులు కనీసం వార్డు సభ్యులుగా కూడా గెలవలేరని తెలిపారు పోలీస్ స్టేషన్లో పైరావీలు చేసుకొని పైసలు సంపాదించుకునేవారు అక్రమ సంపాదనకు మరిగిన వారు అధికారాన్ని అనుభవించాలనుకునే వారు మాత్రమే బిఆర్ఎస్ పార్టీ నుండి వెళ్లిపోవాలనుకుంటున్నారని తెలిపారు. అలాంటి వారిని మాత్రం ప్రజలు నమ్మరని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయకపోతే ప్రజల మధ్యలోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ చెప్పిన మోసపూరితమైన వాగ్దానాలను వివరించాలని తెలిపారు ఎంపీ ఎన్నికల్లో మానుకోట నుండి మరోసారి మాలోతు కవితను గెలిపించాలని కార్యకర్తలందరూ సమిష్టిగా పనిచేయాలని కోరారు సమావేశంలో ఎంపీపీ బాలు నాయక్, మండల పార్టీ అధ్యక్షులు నున్న రమణ, కొండపల్లి సీతారాం రెడ్డి, నున్న మల్లికార్జున్, నంద్యాల మధుసూదన్ రావు, సామినేని సతీష్, తేజావత్ గమ్మి ,రాజు, గౌస్, సురేష్ కుమార్, పార్ట్ ని చంటి ,బురగల శరత్, విద్యాసాగర్, కాలా యశోద కుమార్, మౌనిక ,జైన్ మన్మధరావు ,కందుల అరుణ, సంధ్య ,కొత్త వీరన్న, నంద తదితరులు పాల్గొన్నారు