బుర్కి తండ గ్రామ సర్పంచ్ అజ్మీరా జ్యోతి వీరన్న నాయక్
బుర్కి తండ గ్రామ సర్పంచ్ అజ్మీరా జ్యోతి వీరన్న నాయక్
తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా.
మూడో విడుత స్థానిక సంస్థల ఎన్నికల్లో నిండు మనసుతో ఆశీర్వదించిన బుర్కి తండ గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నామని, ఈ గెలుపు తండ అభివృద్ధి పట్ల బాధ్యతను పెంచిందని తండ ను ఆదర్శ తండ గా తీర్చిదిద్దుతామని గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థి అజ్మీరా జ్యోతి వీరన్న నాయక్ అన్నారు. మరిపెడ మండలంలోని బుర్కి తండ గ్రామంలో జరిగిన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తండ లోని మొత్తం 8 వార్డులకు గాను ఏడు వార్డులు కాంగ్రెస్, ఒక వార్డు #brs బిఆర్ఎస్ గెలుచుకోవడం జరిగింది,సర్పంచుగా అజ్మీరా జ్యోతి వీరన్న నాయక్ 54 పై చిలుకు మెజారిటీతో ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా శనివారం వారు మాట్లాడుతూ నన్ను గుర్తించి నాకు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి గా టికెట్ ఇచ్చిన డోర్నకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్, #congress కాంగ్రెస్ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీర్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు, మండల అధ్యక్షుల వారి సహకారం తో, తండ ప్రజల సహకారంతో తండ లో నెలకొన్న సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. తమమీద నమ్మకంతో గెలిపించిన గ్రామస్తుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆలోచనలకు అనుగుణంగా పనులు చేస్తామని అన్నారు. తమను నిండు మనస్సుతో ఆశీర్వదించి గెలిపించిన తండ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ వారికి రుణపడి ఉంటామని అన్నారు.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.