నిజమైన హీరో లు అనిపించుకున్న కురవి పోలీసులు
Mahabubabadగత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు నేరడ గ్రామం వద్ద వరద నీటి లోకి ఒక వ్యక్తి వెళ్తున్నాడు అని 100 కి డయల్ చేసి సమాచారం రాగ వెంటనే కురవి ఎస్సై సతీష్ స్పందించి,ఏఎస్ఐ సదయ్య,హెడ్ కానిస్టేబుల్ వెంకటయ్య,కానిస్టేబుల్ కాశీరాం లు ద్వారా ఆ వ్యక్తి ని వరద నీటి నుండి బయటకు తీసుకొని తీసుకొని వచ్చి కాపాడినారు.ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడాలంటే హీరో అక్కర్లేదు,నిజాయితీ ముఖ్యం దానికి నిదర్శనమే కురవి పోలీస్ స్టేషన్ నిజమైన హీరోలు అనిపించుకున్నారు.కురవి పోలీసులు మతిస్థిమితం లేని ఒక అబ్బాయిని కాపాడానిలో ముఖ్యపాత్రను పోషించి కాపాడడం జరిగింది.తనని పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి సముదాయించి వివరాలు అడగగా అతను ముళ్ళపూడి హర్షవర్ధన్ 19 సం”తండ్రి శ్రీకాంత్,గుంటూరు జిల్లా,పచ్చలపాడిపారు గ్రామం,అని తెలుపగా ఇతని విషయం గుంటూరు పోలీస్ లకు తెలియచేసి వారి ద్వారా ఇతని తల్లి తండ్రులకు విషయం తెలుపగ వారు వచ్చి కుటుంబ సభ్యులు యువకుడిని చూసుకొని బాగోద్వేగానికి గురై,వాళ్ళ అబ్బాయి రెండు రోజుల క్రితం విజయవాడ లో తప్పిపోయాడని విజయవాడ లో వరదల వచ్చిన వరదల వల్ల మేము ఆశలు వదులుకున్నాం అని కన్నీటి పర్యంతంమైనారు.తర్వాత అబ్బాయిని కాపాడి వాళ్ళ బంధువులు వచ్చేవరకు రక్షణ గా చూసుకొని వారికి అప్పగించిన కురవి పోలీస్ లకు కృతజ్ఞతలు తెలిపి ఆ అబ్బాయిని తీసుకొని వెళ్లడం జరిగింది.గ్రామ ప్రజలు అబ్బాయి కుటుంబ సభ్యులు కురవి ఎస్సై,కానిస్టేబుళ్ల ను అభినందన లతో ముంచెత్తి హర్షం వ్యక్తం చేశారు.