
నిజాయితీగా వ్యాపారం చేయండి లేదంటే చర్యలు తప్పవు
నిజాయితీగా వ్యాపారం చేయండి లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ పాత ఇనుప సామాను కొనుగోలు వ్యాపారస్తులు, ఆటో కన్సల్టెన్సీ యాజమాన్యంకి సూచించారు. కమిషనరేట్ పరిధిలో వాహనచోరీల నియంత్రణకై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ట్రై సిటీ పరిధిలోని పాత సామాను కోనుగోలు వ్యాపారస్థు లతో పాటు ఆటో కన్సల్టెన్సీ నిర్వహకులతో గురువా రం భీమారంలోని శుభం కళ్యాణ వేదికలో పోలీస్ కమీషనర్ సమావేశాన్ని ఏర్పాటు చేసారు ఈ సమా వేశంలో ముందుగా పోలీస్ కమిషనర్ చోరీకి గురైన ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయడం ద్వారా సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు జరిగే నష్టంతో పాటు, దేశానికి ఎవిధంగా నష్టం వాటిల్లుతుందో పోలీస్ కమిషనర్ వ్యాపారస్తులకు వివరించారు అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాతుడూ డబ్బు సంపాదనే లక్ష్యంగా చోరీకి గురైనయిన వాహనాల కొనుగోలు చేయడం సరికాదని, నిబంధనలు పాటిస్తూ వ్యాపారం నిర్వహించుకోవాలని, ముఖ్యంగా మధ్యత రగతి ప్రజలు అధికంగా వినియోగించే ద్విచక్ర వాహ నాన్ని దొంగల నుండి కోనుగోలు చేసి వాటిని తుక్కు రూపంలో తరలించడం మానుకోవాలని. పాత ఇనుప సామాను, సెకండ్ హ్యాండ్ వాహన విక్రయ వ్యాపా రస్థులు ముఖ్యంగా ఎదైన వాహనం కొనుగోలు చేసే సమయంలో తప్పని సరిగా వాహనం విక్రయించే వ్యక్తులకు సంబంధించి ఆధార్ లాంటి గుర్తింపు కార్డుల తో పాటు, వారి సెల్‌ఫోన్ నంబర్ తీసుకోవాలని వాహ నం కొనుగోలు చేసే సమయంలోనే వారికి ఫోన్ చేసి నిజనిర్ధారణ. చేసుకోవాలని, వాహనాల క్రయ విక్రయా లకు సంబంధించి మార్గదర్శకాలు పాటిస్తూ రికార్డు లను రూపోందించుకోవాలని, ముఖ్యంగా ఒరిజినల్ పత్రాలు వుంటేనే వాహనాలను కొనుగోలు చేయాలని, ప్రతి వ్యాపార కేంద్రంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, ఎవరైన వ్యాపారస్తులు చట్టవ్యతి రేకంగా వాహన కొనుగోలుకు పాల్పడితే ఒకటి, రెండు మార్లు మినహాయింపు ఇవ్వబడుతుందని లేదంటే వ్యాపాస్థులపై పిడియాక్ట్ క్రింద కేసులు నమోదు చేస్తా మని, నిజాయితీగా వ్యాపారం నిర్వహించుకుంటే పోలీసుల వేధింపులు వుండవని పోలీస్ కమిషనర్ తెలియజేసారు.ఈ సమావేశంలో క్రైమ్స్ డిసిపి దాసరి మురళీధర్, ఏసిపిలు మల్లయ్య, రమేష్ కుమార్, కిరణ్ కుమార్, డేవిడ్ రాజు సతీష్ బాబుతో పాటు ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్.ఐలు పాల్గోన్నారు