
నిత్యావసర సరుకులు పంపిణి చేసిన నాయిని
ఇటీవల కురిసిన భారి వర్షాల కారణంగా 29 వ డివిజన్ రామన్నపేటలో & 11 డివిజన్ పోతననగర్ & రంగంపేటలో వరద ముంపుకు గురైన దాదాపు 400 కుటుంబాలకు నాయిని విశాల్ రెడ్డీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణి చేసిన నాయిని..
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 29 వ డివిజన్ డివిజన్ అద్యక్షుడు ఓరుగంటి పూర్ణ ఆధ్వర్యంలో బాబా రాందేవ్ సత్సంగ్ మందిర్ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మరియు 11 వ డివిజన్ అధ్యక్షుడు గన్నారపు సంగీత్ & గోల్కొండ సదానందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అద్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి గారు పాల్గొని ఇటీవల కురిసిన భారి వర్షాల కారణంగా రామన్నపేటలో వరద ముంపుకు గురైనా దాదాపు 400 మంది కుటుంబాలకు నాయిని విశాల్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణి చేసారు.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…
నగరం నీట మునిగాక ప్రజలు బయటకు వెళ్లొద్దని సూచనలు ఇస్తున్నారే తప్ప సహాయక చర్యలు చేపట్టుతున్నామని చెప్పట్లేదు.
స్మార్ట్ సిటీ చేస్తామని ప్రజా ధనాన్ని వృధా చేసి, నేడు ఓరుగల్లు ప్రజలను వరదల్లో ముంచినవ్, నువ్వు, నీ కుటుంబం, మీ నాయకులు మాత్రం ఫార్మ్ హౌస్ లు కట్టుకుని సుఖంగా నిద్ర పోతున్నారు.
నేడు వరంగల్ ప్రజలు నీట మునిగి ఆర్ధికంగా నష్టపోయి తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. వరద బాధితులకు కనీసం నిత్యావసర సరుకులు కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు.
ఇక్కడ పేద ప్రజలు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నారు. వరద ముంపుకు గురై సర్వం కోల్పోయిన ప్రజలకి తక్షణమే 50 వేలు ఆర్థిక సహాయం ప్రకటించి అందజేయాలని కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం.
కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడు అండగా ఉంటుందని వారికి మనో ధైర్యాన్ని కల్పిస్తూ భరోసా ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ రావు, బుద్ధ లత, కార్పొరేటర్ గా పోటి చేసిన అభ్యర్థి సిరిమల్లె చెన్నమల్లు, డివిజన్ అద్యక్షులు ఓరుగంటి పూర్ణ, గన్నారపు సంగీత్, గోల్కొండ సదానందం మొహమ్మద్ సమద్, జి. శివ ప్రసాద్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి, NSUI జిల్లా అద్యక్షుడు పల్లకొండ సతీష్, తౌటి రెడ్డి రవీందర్ రెడ్డి, గుండ కృష్ణం రాజు, సౌరం కుమారస్వామి, సౌరం బాలకృష్ణ, దినేష్, కృష్ణ, ఎం. లక్ష్మన్, పాకాల మురళి, వీరమని, క్రాంతి,, శ్రీకాంత్, నవీన్, కుమార్, నిర్మల, తదితరులు పాల్గొన్నారు.