
నిరుద్యోగ మార్చ్ వాల్ పోస్టర్స్ ను ఆవిష్కరన
ఛలో వరంగల్ నిరుద్యోగ మార్చ్ ఏప్రిల్ 15 రోజున TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ పై నిరసన సిట్టింగ్ జడ్జి గారిచే విచారణ జరిపించాలి. కేటీఆర్‌ను మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని లీకేజీతో నష్టపోయిన అభ్యర్థులకు రూ.1 లక్ష నష్టపరిహారం ఇవ్వాలని బిజెపి ఓరుగల్లు పోరుబాట కాకతీయ యూనివర్సిటీ క్రాస్ రోడ్ నుండి అంబేడ్కర్ విగ్రహం వరకు, నిరుద్యోగ మార్చ్ ఉంది దానిలో భాగంగా ఈరోజు నియోజకవర్గ కార్యాలయంలో కన్వీనర్ ఐలోని అంజి రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే బొజ్జపల్లి రాజయ్య గారి తనయుడు బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు హాజరై నిరుద్యోగ మార్చ్ వాల్ పోస్టర్స్ ఆవిష్కరించారు..
రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహాన్ని పాలతో శుద్ధి చేయడం జరిగింది..
ఈ కార్యక్రమంలో బిజెపి సోషల్ మీడియా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇనుగాల కార్తీక్ రెడ్డి, జఫర్గడ్ మండల అధ్యక్షుడు తౌటి సురేష్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, యువమోర్చా మండల అధ్యక్షుడు రాజు నాయక్ , చిల్పూర్ మండలం స్వశక్తి అభియన్ కోఆర్డినేటర్ గుగులోతు మధు నాయక్ తదితరులు ఉన్నారు