
రాంబాయమ్మ కుటుంబానికి గృహలక్ష్మి పథకం కింద ఇల్లు కేటాయించాలని బిజెపి బీసీ విద్యార్థి సంఘం బీఎస్పీ పార్టీల ఆధ్వర్యంలో తహసిల్దార్ ఆఫీస్ ముందు నిరాహార దీక్ష…. మునగాల మండల కేంద్రానికి చెందిన విశ్వబ్రాహ్మణ కుటుంబానికి చెంది వికలాంగులైన వెగ్గలం రాంబాయమ్మ అతని కుమారుడు వెగ్గలం వెంకటేశ్వర్లు బ్రతుకు చిత్రం మీద వివిధ వార్త పత్రికల కథనాలు వచ్చి పలువురు ఆర్థిక సాయం చేసిన ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటని బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు భద్రంరాజు కృష్ణ ప్రసాద్ బీసీ విద్యార్థి సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామకృష్ణ యాదవ్ బీఎస్పీ నియోజకవర్గ కార్యదర్శి కోట మన్మధుడు తదితర కార్యకర్తలు రంబాయమ్మ కుటుంబానికి మద్దతుగా నిరాహార దీక్ష చేసి మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా పూరి గుడిసెలో జీవనం వెళ్లదీస్తున్నారని వారి జీవనశైలిని చూస్తుంటే బాధ వేస్తుందని వారు అన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు రాజకీయ నాయకుల జోక్యంతో ధనవంతులకే లబ్ధి చేకూరేలా ఉన్నాయని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేదవారి స్థితిగతులను చూసి సంక్షేమ పథకాలు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు ఇంత జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే గాని అధికార పార్టీ నాయకులు అధికారులు స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కుటుంబానికి అన్యాయం జరిగితే మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఓ బి సి మండల అధ్యక్షుడు దాసరి మధు యాదవ్ కోటా ప్రవీణ్ రామ్ లక్ష్మణ్ శివకుమార్ నవీన్ ముదిరాజ్ సతీష్ వర్మ సువర్ణాచారి తదితరులు పాల్గొన్నారు