నిరుపేద లకు దుప్పట్లు పంపిణీ
తల్లాడ లో స్థానిక ఆర్యావైశ్య కళ్యాణ మండపం (ఫంక్షన్ హల్ నందు) మంగళవారం మదర్ తెరిసా హెల్పింగ్ హ్యాండ్స్ ద్వారా నిరుపేద వృద్ధులకు చలికాలం దృష్టిలో వుంచు కొని దుప్పట్లు పంపిణీ చేసారు.హెల్పింగ్ హేండ్స్ నిర్వహకులు కొత్తూరు ఫణి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా హెల్పింగ్ హెండ్స్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ మరియు ఎండాకాలంలో చలివెంద్రాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అనేక సేవా కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. దీనికి మా కమిటి సభ్యుల ప్రోత్సాహం మరవలేనిది. ఇంకా అనేక సేవా కార్యక్రమాలు భవిష్యత్తు లో ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమం లో మొక్క క్రిష్ణర్జున్, పెండెం. లక్ష్మి నారాయణ, షేక్ షఫీ, కొత్తూరు ఫణీంద్ర మరియు కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.