
మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులను అర్థరాత్రి నుంచి అరెస్టు చేసి స్టేషన్లకు తరలించి,
వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులను, కార్యకర్తలను అర్ధరాత్రి నుంచి అరెస్టు చేసి దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్ తరలించి నిర్బంధించటం ఆప్రజాస్వామ్యమని, ప్రజా సమస్యల గురించి మంత్రులకు చెప్పుకునే స్వేచ్ఛ గాని, నిరసన తెలియజేసే హక్కు గాని లేనట్లు ఈ ప్రభుత్వం అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది .
గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం టిడిపిలో గాని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో గాని ఇటువంటి చర్యలకు పాల్పడింది ఏనాడు లేదు.
టిఆర్ఎస్ ప్రభుత్వం లాగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ, ప్రజల హక్కులను కాలరాస్తూ సమస్యలను చెప్పుకునే పరిస్థితి లేకుండా ఏనాడూ జరగలేదని. అదే గనక కాంగ్రెస్ పార్టీ నిరసనలను అనగదొక్కే ప్రయత్నం చేసి ఉంటే ఈరోజు తెలంగాణ వచ్చేదా…? అని భద్రాచలం ఎమ్మెల్యే వీరయ్య ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన టిపిసిసి సభ్యులు బుడగం శ్రీనివాస్, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ చింత్ర్యాల రవికుమార్ , సరేల నరేష్ మరియు యువజన కాంగ్రెస్ జిల్లా నాయకుడు ప్రదీప్ ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.