నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్ల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండలంలోని 30 పడకల ప్రభుత్వ హాస్పిటల్ లో వైద్యులు ఎప్పుడూ కూడా
అందుబాటులో ఉండడం లేదని పేషెంట్ లు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మండలంలోని ప్రజలు సీజనల్ వ్యాధులతో అనేక ఇబ్బందులు పడి హాస్పటల్ కు వస్తే పట్టించుకున్న నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎప్పుడు కూడా డాక్టర్లు అందుబాటులో ఉండడం లేదనిని ఒక వేళ ఉన్నా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు.ఈ రోజు జఫర్ఘడ్ గుట్ట పై లక్ష్మీ నరసింహా స్వామీ బ్రహ్మోత్సవాలు జరుగు తుండగా దైవ దర్శనం కోసమని డ్యూటీలో ఉన్న డాక్టర్లు పేషెంట్లను పట్టించు కోకుండా గుట్ట పైకి వెళ్ళడం జరిగిందని పేషెంట్ల పట్ల నిర్లక్షం ఏంటని ప్రజలు విమర్శిస్తున్నారు.నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డాక్టర్ల పై ఉన్నత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.