తెలంగాణ ఉద్యమ ఆరంభం నుండి పనిచేసినా ఏ పదవి రాని ప్రముఖనాయకులుగా నూకల నరేష్ రెడ్డి, నూకల శ్రీరంగారెడ్డి మనకు డోర్నకల్ నియోజకవర్గంలో కనిపిస్తారు. నూకల శ్రీరంగారెడ్డిది మరిపెడ మండలం యరిజర్ల. ఈయనకు కేటీఆర్ స్నేహితునిగా కూడా మంచిగుర్తింపు ఉంది. తెలంగాణ ఉద్యమకాలంలో కేటీఆర్ శ్రీరంగారెడ్డి ఇంటికి వచ్చారు. ఇద్దరు కలిసి కందికొండ జాతరకు వెళ్ళి కందికొండగుట్టను కూడా అధిరోహించారు. ప్రస్తుతం శ్రీరంగారెడ్డి మంత్రి సత్యవతిరాథోడ్ ప్రధానఅనుచరునిగా కొనసాగుతున్నారు. మరిపెడ మండలం పురుషోత్తమాయగూడెం గ్రామానికి చెందిన నూకల నరేష్ రెడ్డి గురించి ఈ..ప్రాంతంలో తెలియని వారెవ్వరు ఉండరు. డోర్నకల్ ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ గా, టిడిపి తరుపున ఆయన పోటీచేసారు. టిఆర్ఎస్ లో ఉద్యమకాలం నుండి కొనసాగుతున్నారు.రెడ్డి సామాజికవర్గానికి చెందిన పొంగులేటి పార్టీ మార్పు.రెడ్డి సామాజిక వర్గంపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్న నెపద్యంలో మంత్రి కేటీఆర్ మహబూబాబాద్ లో నూకల శ్రీరంగారెడ్డితో మాట్లాడడం, పురుషోత్తమాయగూడెం కు స్వయంగా వెళ్ళి నరేష్ రెడ్డి తో మాట్లాడడం చుట్టూ అనేక వార్తలు వ్యాపిస్తున్నాయి.నూకల వారి కల నెరవేరవచ్చని. వీరిద్దరికి ఏదో ఓ నామినేటెడ్ పదవి వరించివచ్చే అవకాశం లేకపోలేదని ఊహాగానాలు జోరుగా వినవస్తున్నాయి.