నూతన రేషన్ కార్డులు మంజూరు చేయాలి
తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా రేషన్ కార్డులు మంజూరు చేయాలని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాసాని కిషోర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతన రేషన్ కార్డులు మంజూరు చేయాలని డివైఎఫ్ఐ కమిటీ పిలుపు మేరకు తాసిల్దార్ నాగేశ్వరరావు కు డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం గత తొమ్మిదిన్నర ఏళ్లుగా రేషన్ కార్డులు మంజూరు చేయకపోవడంతో ప్రజలు ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకు అనర్హులు గా మిగిలిపోతున్నారని తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వలేని ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సామాన్య ప్రజలకు సంక్షేమ పథకాలు అందకుండా రేషన్ కార్డులు జారీ చేయకుండా కుట్రలు చేస్తున్న ప్రభుత్వాన్ని సాగనంపాలని తెలంగాణ ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు కాసాని రాంబాబు, అనిల్, రమేష్, వెంకన్న తదిరులు పాల్గొన్నారు.