నూనావత్ కబీర్ సేవలకు జిల్లా కలెక్టర్ ప్రశంస
కొత్తగూడెం గిరిజన కళాశాల బాలుర వసతి గృహంలో వసతి గృహ సంక్షేమ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న నూనావత్ కబీర్ కు జిల్లా స్థాయిలో ప్రతిష్టాత్మక గౌరవం లభించింది.
గణతంత్ర వేడుకల సందర్భంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ఐ.ఏ.ఎస్ చేతుల మీదుగా ఆయనకు ప్రశంసా పత్రం అందజేయబడింది.
వసతి గృహంలో విద్యార్థులకు అనుకూల వాతావరణం, క్రమశిక్షణ, భోజన నాణ్యత, ఆరోగ్య సంరక్షణ, విద్యా ప్రోత్సాహం వంటి రంగాల్లో ఆయన చూపిన నిబద్ధతకు అధికారులు ప్రత్యేకంగా ప్రశంసలు తెలిపారు.
ఈ సందర్భంగా కబీర్ అన్నారు: “ఈ గౌరవం వ్యక్తిగతంగా కాదు, వసతి గృహ సిబ్బంది అందరి కృషికి గుర్తింపు. భవిష్యత్తులో విద్యార్థుల సంక్షేమ కోసం మరింత అంకితభావంతో సేవలు అందిస్తానని”.అన్నారు