మణిపూర్ లో క్రైస్తవులపై, స్త్రీలపై జరుగుతున్న హింసాత్మక సంఘటనలు కారణంగా కోదాడ నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నేటి ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగుతున్న శాంతియుత ప్రదర్శనకు కోదాడ నియోజకవర్గంలోని పాస్టర్లు, క్రైస్తవులు వేల సంఖ్యలో తరలిరావాలని తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ బిషప్, ఉమ్మడి నల్గొండ జిల్లా సీనియర్ పాస్టర్ బిషప్ డాక్టర్ జె సుదర్శనం శనివారం కోదాడ పట్టణంలోని బాప్టిస్ట్ చర్చిలో జరిగిన పాస్టర్ల సమావేశంలో ఆయన పాల్గొని పిలుపునిచ్చారు. మణిపూర్ రాష్ట్రంలో కొంతమంది రాజకీయ మతోన్మాదులు మతాలకు మధ్య చిచ్చులు పెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని, స్త్రీలపై అమానవీయ సంఘటనల దృష్ట్యా కోదాడ పట్టణంలో శాంతియుత ప్రదర్శన జరుగుతుందని ఆయన తెలిపారు. కోదాడ నియోజకవర్గంలో ఉన్న పాస్టర్లు, క్రైస్తవ నాయకులు, క్రైస్తవులు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు రెవ డా జి.ఆర్. అబ్రహాము, ఎ జె సామ్యూల్, వి.యెషయా, రామారావు, లాజర్, జోసెఫ్ రాజు, రూఫస్, పాల్ చారి, జె జె సామ్యూల్ సన్, ఎ. అబ్రహాం, రాము, లీగల్ అడ్వైజర్ రామకృష్ణ, రమేష్, ప్రసాద్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.