నేర విచారణలో జాప్యం వహిస్తే సహించేది లేదు
Bhadradri Kothagudemఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా పోలీసు అధికారులతో నెలవారీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జులై ఒకటో తేదీ నుండి అమలు కానున్న మూడు కొత్త క్రిమినల్ చట్టాల పట్ల పోలీసు శాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు.కేసుల నమోదు,విచారణ విషయంలో ఏవైనా సందేహాలు తలెత్తితే ఉన్నతాధికారుల సలహాలు,సూచనలతో వాటిని నివృత్తి చేసుకోవాలని తెలిపారు.విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని అన్నారు.ప్రతీ కేసులో సమగ్ర దర్యాప్తును చేపట్టి “క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్” ద్వారా నేరస్తులకు శిక్ష పడే విధంగా బాధ్యతగా ప్రతి ఒక్కరోజు పనిచేయాలని సూచించారు.దొంగతనం కేసుల్లో చోరీ సొత్తును రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.పెండింగ్లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు.గంజాయి లాంటి మత్తు పదార్ధాలను రవాణా చేసే వారితో పాటు సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేసి కఠినంగా వ్యవహారించాలని తెలిపారు.గుట్కా,మట్కా,జూదం,బెట్టింగు లాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి అట్టి వ్యక్తులపై చట్ట ప్రకారం కేసుల నమోదు చేయాలని తెలిపారు.జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అక్కడ ప్రమాద నివారణ చర్యలను చేపట్టాలని సూచించారు.సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో జిల్లా వ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.రౌడీషీటర్లు మరియు పాత నేరస్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఏర్పాటు చేసుకుని వారికి కౌన్సిలింగ్ నిర్వహిస్తూ ఉండాలని తెలిపారు.బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.సాధారణ ప్రజానీకానికి ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తుల పట్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డిఎస్పీ రెహమాన్,పాల్వంచ డిఎస్పీ సతీష్ కుమార్,డీసీఆర్బీ డిఎస్పీ మల్లయ్యస్వామీ,ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, జిల్లా పోలీస్ కార్యాలయ ఏవో జయరాజు మరియు సీఐలు,ఎస్సైలు,సిబ్బంది పాల్గొన్నారు.