
నేషనల్ హైవే భూ సేకరణకు వేగం పెంచాలి
ఈ69 న్యూస్ హనుమకొండ/స్టేట్ బ్యూరో మొహమ్మద్ సలీం
హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలో నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి 163జి భూసేకరణ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని కలెక్టర్ పి.ప్రావీణ్య ఆదేశాలు జారీచేశారు.బుధవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో ఆర్డీవో డాక్టర్ నారాయణ,తహసీల్దార్లతో కలిసి భూసేకరణ పురోగతిని సమీక్షించారు.రైతులకు న్యాయమైన పరిహారం చెల్లింపు,అవసరమైన బడ్జెట్ అంచనాల తయారీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కోసం 12.38 ఎకరాల భూమి,గౌరవెల్లి ప్రాజెక్టు పరిధిలోని భీమదేవరపల్లి,వేలేరు మండలాల్లో భూ సేకరణ అంశాలపై అధికారులతో చర్చించారు.అలాగే ఎల్కతుర్తి నుంచి ముల్కనూర్ వైపు జాతీయ రహదారి పనుల పురోగతిపై సమాచారం తీసుకున్నారు.ఈ సమావేశంలో సంబంధిత తహసీల్దార్లు,జాతీయ రహదారుల శాఖ అధికారులు పాల్గొన్నారు.