
ఈ69న్యూస్ స్టేషన్ ఘనపూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవ పూర్ గ్రామానికి చెందిన బండ హరీష్(28)అనే వ్యక్తి గురువారం ఉదయం 11 గంటల సమయంలో చాగల్లు గ్రామం శ్రీదర్ వైన్స్ దగ్గర్లో నేషనల్ హైవే 163 రోడ్డుపై వాటర్ ట్యాంకర్ తో డివైడర్ మద్యలో గల చెట్లకు నీళ్ళు పట్టుతుండగా జనగామ వైపు నుండి హన్మకొండ వైపుకు వెళ్ళుతున్న లారీ వేగంగా ఢీ కొనడంతో హరీష్ అక్కడికక్కడే మరణించాడని,ట్యాంకర్ నడుపుతున్న రమేష్ కు స్వల్ప గాయాలయ్యాయని సిఐ వేణు మీడియాకు వెల్లడించారు.మృతుని తండ్రి స్వామీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.ఘటన స్థలాని డిసిపి రాజమహేంద్ర చేరుకుని పరిశీలించారు.