
telugu galam news e69news local news daily news today news
మహిళా ఐక్య వేదిక కార్యవర్గ సమావేశం
సామాన్యులకు న్యాయస్థానాలపై నమ్మకం సన్నగిల్లుతున్న సమయంలో బిల్కిస్ బానో విజయం న్యాయస్థానాలపై నమ్మకాన్ని మరింత పెరిగిందని యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి తెలిపారు. కర్నూలు నందలి స్థానిక బి క్యాంపులో గల యస్సీ యస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక ప్రధాన కార్యాలయంలో మహిళా ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షురాలు నంది విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన మహిళా ఐక్య వేదిక కార్యవర్గ సమావేశంలో పట్నం రాజేశ్వరి, బీసీ నాయకులు శేషఫణి, ఖధీరుల్లా, భరత్ కుమార్, డాక్టర్ హరి లు పాల్గొన్నారు. బిల్కిస్ బానో విజయం సందర్భంగా మిఠాయిలు పంచిపెట్టి ఆనందాన్ని వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పట్నం రాజేశ్వరి మాట్లాడుతూ అన్యాయానికి గురైన మహిళలు నిరాశ పడకుండా న్యాయ పోరాటం చేయాలని అంతిమంగా న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. మహిళా ఐక్య వేదిక కమిటీ సభ్యులు అందరూ కలిసికట్టుగా శ్రమించి మహిళా ఐక్య వేదికను బలోపేతం చేయాలని ఆమె కార్యవర్గ సభ్యులను కోరారు.రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఐక్య వేదిక కమిటీ నిర్మాణాలు చేపట్టాలని,ఆమె కమిటీ సభ్యులకు తెలిపారు. ఆత్మగౌరవం,హక్కులకై మహిళలు నిరంతరం పోరాడాల్సిన పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉందని ఆమె తెలిపారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు, హత్యలకు,దాడులకు, వ్యతిరేకంగా మహిళలంతా ఏకమై న్యాయ పోరాటాలకు సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. అనంతరం గూడూరు మండల అధ్యక్షురాలిగా అమీనాబీ, అనంతపురం జిల్లా గుత్తి మండల అధ్యక్షురాలిగా తాటికొండ సుంకమ్మ లను నియమిస్తున్నట్లు పట్నం రాజేశ్వరి గారు తెలిపారు.ఈ కార్యక్రమంలో భారతమ్మ , హుస్సేన్ బీ, రాధ, ఈరమ్మ , ఆకుతోట పద్మావతి, కొమ్ము పెద్దక్క, ఈశ్వరమ్మ , ఖాసింబీ, షేకూన్ బీ , వరలక్ష్మి, రేవతి,తదితరులు పాల్గొన్నారు.