
యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కా॥ పాలడుగు భాస్కర్
సెప్టెంబర్ 26న కలెక్టరేట్ల వద్ద ధర్నా
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ Ê వర్కర్స్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర కమిటీ సమావేశంఈరోజు (తేది: 23`09`2025)న రాష్ట్ర అధ్యక్షులు కా॥ గ్యార పాండు అధ్యక్షతన సిఐటియు రాష్ట్ర కార్యాలయంలో జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కా॥ పాలడుగు భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు అతి ముఖ్యమైన దసరా పండుగ ఉత్సవాలు ప్రారంభమై నేపథ్యంలో పంచాయితీ కార్మికులు పండుగ పూట పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిరదని, రాష్ట్రవ్యాప్తంగా గత 3 నెలల నుండి వేతనాలు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, బకాయి వేతనాలు తక్షణమే చెల్లించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిచ్చిన హమీ ప్రకారం పంచాయతీ సిబ్బంది వేతనాలకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి గ్రీన్ ఛానల్ ద్వారా కార్మికుల బ్యాంక్ అకౌంట్లలో వేతనాలు జమ చేయాలని, మల్టీపర్పస్ వర్కర్ పని విధానం వలన ప్రమాదాలు జరిగి మరణిస్తున్న కార్మికుల కుటుంబాలకు రూ.20 లక్షల నష్టపరిహారం ప్రకటించాలని, జీఓ నెం.51ని సవరించి మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బకాయి వేతనాల చెల్లింపుకై సెప్టెంబర్ 26వ తేదీన రాష్ట్రవ్యాప్త కలెక్టరేట్ల వద్ద జరిగే ధర్నాల్లో పంచాయితీ కార్మికులందరూ పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాగంటి వెంకటయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు సుధాకర్, రాష్ట్ర మహిళా కన్వీనర్ పొట్టా యాదమ్మ మరియు రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ పాల్గొన్నా