
nadigudeam news loacl news telugu news e69news suryapeat news sarpanch news
సర్పంచ్ గుర్రం నీలిమా గాంధీ గళం న్యూస్ :జనవరి 20 (నడిగూడెం) గ్రామపంచాయతీ రికార్డులు అప్పగించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలని సర్పంచ్ గుర్రం నీలీమాగాంధీ కోరారు.శనివారం కరివిరాల సర్పంచ్ గుర్రం నీలిమాగాంధీ పాత్రికేయులతో మాట్లాడుతూ కరివిరాల గ్రామ కార్యదర్శిగా పనిచేసిన నాగరాజు బదిలీపై పాలకీడు మండలానికి వెళ్లడంతో 29 డిసెంబర్ 2023న కరివిరాల గ్రామ ఇంచార్జ్ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన కార్యదర్శికి బదిలీపై వెళ్లిన నాగరాజు రికార్డులు అప్పగించ పోవడంతో పాలన పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.కార్యదర్శి గదికి తాళం వేసుకొని వెళ్లారని తాళం చెవి కూడా అప్పగించక పోవడంతో శనివారం నిర్వహించిన గ్రామ సభ కూడా ఆరు బయట నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రికార్డులు అప్పగించ పోవడంతో గ్రామాభివృద్ధి కుంటిపడిందన్నారు. రికార్డులు అప్పగింతపై జిల్లా అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు చేయగా సమస్యను పరిష్కరించాలని డిపిఓ యాదయ్యను అడిషనల్ కలెక్టర్ ఆదేశించిన డిపిఓ సమస్యను పరిష్కరించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఫోన్ చేసినా స్పందించడం లేదని తెలిపారు.గత పది రోజుల నుండి సమస్యను స్థానిక ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.రికార్డులు అప్పగించకుండా గదికి తాళం వేసుకొని గ్రామ అభివృద్ధి పనులు జరగకుండా అడ్డుకుంటున్న కార్యదర్శి నాగరాజు పై చట్టపరమైన చర్యలు తీసుకోని గ్రామాభివృద్ధికి అధికారులు సహకరించాలని కోరారు. ఎంపీడీవో వివరణ మండలంలోని కరివిరాల పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన నాగరాజు బదిలీపై పాలకీడు మండలానికి బిల్ కలెక్టర్ గా బదిలీ చేయగా కార్యాలయం నుండి బదిలీ ఉత్తర్వులు తీసుకోకుండా పాలకీడు మండలంలో విధుల్లో చేరకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు.ఇంచార్జి పంచాయతీ కార్యదర్శి బాధ్యతలు చేపట్టిన రత్నయ్యకు బాధ్యతలు అప్పగించాలని కోరిన స్పందించడం లేదని అధికారుల ఫోన్లుకు కూడా స్పందించడం లేదని త్వరలో రికార్డులు అప్పజెప్పి సమస్యకు పరిష్కారం చూపుతామని తెలిపారు.