
ఈ69 న్యూస్: జనగామ జిల్లా లింగాల గణపురం మండలం పటేల్ గూడెంలో సిపిఐ గ్రామ శాఖ సమావేశం అనుముల మల్లయ్య అధ్యక్షతన జరిగింది.సమావేశానికి సిపిఐ మండల కార్యదర్శి రావుల సదానందం హాజరై మాట్లాడారు.రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.వ్యాపారులు తక్కువ ధరకు పంటలు కొనుగోలు చేస్తుండటంతో రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు.గ్రామాల్లో ఐకెపి సెంటర్లు ఏర్పాటు చేసి పంట కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.సభలో పొన్నాల మహిపాల్ రెడ్డి గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శిగా,నకిరెడ్డి యాదగిరి రెడ్డి సంయుక్త కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎన్సీ నాగయ్య,రామకృష్ణ,రాజు,నరసయ్య,సోమయ్య,మల్లయ్య,బాల్ రెడ్డి,సురేష్ తదితరులు పాల్గొన్నారు.