
07-12-2022**.** *
జనగామ జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ తో ఎన్పిఆర్డీ 3వ మహాసభల వాల్ పోస్టర్ ఆవిష్కరణ.** *పట్టణ, పల్లె ప్రకృతివనాలలో వికలాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.*—————————–(ఎన్పిఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ డిమాండ్.)పట్టణ, పల్లె ప్రకృతివనాల్లో వికలాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించి, ఉపాధిహామీ పనిలో 200 రోజులు పని దినాలు వికలాంగులకు కల్పించాలని, పట్టణంలో పట్టణ ఉపాధిహామీ పథకం ప్రవేశపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డిసెంబర్ 26న హైదరాబాద్ లో భారీబహిరంగ సభ ఉంట్టుందని, 27, 28 తేదీలలో అఖిల భారత మహాసభలు జరుగుతాయని, ఈ బహిరంగ సభకు పెద్దఎత్తున వికలాంగులు కదలిరావాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక(ఎన్పిఆర్డీ) రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ పిలుపునిచ్చారు. దివి: 07-12-2022 బుధవారం రోజున వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పిఆర్డీ) జనగామ జిల్లా అధ్యక్షులు పాముకుంట్ల చందు ఆధ్వర్యంలో **ఎన్పిఆర్డీ అఖిల భారత 3వ మహాసభల వాల్ పోస్టర్ ను జనగామ జిల్లా పరిషత్ చైర్పర్సన్ పాగాల సంపత్ గారితో ఆవిష్కరణ చేయించడం జరిగింది. ఈ సందర్బంగా పాగాల సంపత్ గారు మాట్లాడుతూ** పట్టణ ఉపాధిహామీ పథకం కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకొనిపోయి పరిష్కారానికై కృషి చేస్తానన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలలో పల్లె ప్రకృతివనాలలో వికలాంగుల ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్, జిల్లా డీఆర్డీఏ పి.డి ల దృష్టికి తీసుకుపోయి వారి ద్వారా మండల అధికారులకు ఆదేశాలు పంపే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. జిల్లాలో వికలాంగులకు ఏ సమస్య వచ్చిన నేరుగా కలవొచ్చని అన్నారు. అనంతరం **ఎన్పిఆర్డీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిట్ల గణేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ** రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు మరియు పట్టణాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా పల్లె ప్రకృతివనాలను ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో వికలాంగులకు ఉపాధి కల్పించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లో వికలాంగులకు తీరని అన్యాయం జరిగిందన్నారు. వికలాంగుల అవసరాలను గుర్తించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు పూర్తిగా విఫలం చెందాయన్నారు. దేశవ్యాప్తంగా వికలాంగులకు ఒకే పింఛన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత 8 సంవత్సరాల నుండి బడ్జెట్ కేటాయింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్లలో నిరుద్యోగ వికలాంగుల 4 శాతం కేటాయింపు, అన్ని సంక్షేమ పథకాలలో 5 శాతం వాటా కేటాయించాలని తెలిపారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో వికలాంగులకు న్యాయమైన వాటా దక్కడంలేదన్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను తక్షణమే గుర్తించి ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ వికలాంగులు స్వయం ఉపాధి కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేస్తున్న నామినేటెడ్ పోస్టుల్లో వికలాంగులకు అవకాశాలు ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశలో 59.19 లక్షల మంది వికలాంగులకు యు.డి ఐ.డి (వికలాంగుల గుర్తింపు కార్డులు) కార్డులను పంపిణీ చేశారని, చాలా మంది వికలాంగులకు కార్డులు అందలేదని మిగతా వికలాంగులకు ఎప్పుడు పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ రంగసంస్థలు అమ్మడం ద్వారా వికలాంగులు రిజర్వేషన్లు కోల్పోతారని తెలిపారు. రిజర్వేషన్లు అమలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ పాలకులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న 70శాతం వికలాంగులకు ఉపాధి కల్పించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయని విమర్శించారు. మహిళా వికలాంగులపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు రోజురోజుకు పెరిగిపోతున్న, వాటిని అదుపు చేయడంలో ప్రభుత్వాలు విఫలం చెందుతున్నాయని తెలిపారు. మానసిక వికలాంగుల సంరక్షణ కోసం ఎందుకు నిధులు కేటాయించడం లేదని ప్రశ్నించారు. 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం అమల్లోకి వచ్చి 6 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ, చట్టంపై అవగాహనను కల్పించకపోవడంతో అధికారుల నిర్లక్ష్యం మూలంగా వికలాంగులకు అందని ద్రాక్షగా మారుతుందన్నారు. వికలాంగుల సమగ్ర అభివృద్ధి, సాధికారత కోసం ప్రత్యేక పాలసీని ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 27, 28 తేదీలలో ఎన్పిఆర్డీ అఖిల భారత 3వ మహాసభలు హైదరాబాద్ నగరంలో జరుగుతున్నాయని, ఈ మహాసభలలో దేశ వ్యాప్తంగా వికలాంగుల ఎదుర్కొంటున్న సమస్యలు-స్థితిగతు లను, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను చర్చించి, భవిష్యత్ పోరాటాల ప్రణాళికను రూపొందిస్తారని తెలిపారు. డిసెంబర్ 26 ఇందిరా పార్క్ వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది, ఈ భహిరంగ సభకు పెద్దఎత్తున వికలాంగులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభల జయప్రదానికి వికలాంగులు సహాయ, సహకారాలు అందించాలని కోరారు. ఈ జనగామ మండల అధ్యక్షులు నామాల రాజు, నాయకులు మాలోతు రాజ్ కుమార్, రావుల శ్రీనివాస్, ఎం.డి అన్వర్, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.