
జనగామ జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్
జనగామ పట్టణాన్ని ఎల్లప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు.శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వివిధ అంశాలపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష జరిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పట్టణ శుభ్రతలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని,శానిటేషన్ నిర్వహణలో ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం ఉండరాదని స్పష్టం చేశారు.తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని,ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల వెరిఫికేషన్ వివరాలను త్వరగా ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు.ట్రేడ్ లైసెన్స్ లేని షాపులు పట్టణంలో ఒక్కటీ ఉండకూడదని,ఎల్ ఆర్ ఎస్ ఫీజు చెల్లించిన వారికి వెంటనే ప్రొసీడింగ్స్ జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా మున్సిపల్ పరిధిలో ఉన్న 154 మంది పారిశుద్ధ్య కార్మికులకు రెండు జతల యూనిఫార్మ్స్ మరియు టవల్స్‌ను అదనపు కలెక్టర్ స్వయంగా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు,ఆర్వోలు,ఆర్ఐలు,శానిటేషన్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.