పదిన్నర కిలోల కణితి వెలికతీత
Hyderabadవైద్యబృందానికి కృతజ్ఞతలు తెలిపిన మహిళ కుటుంబ సభ్యులు మహిళా కడుపులో నుంచి పదిన్నర కిలోల కణితిని నిమ్స్ వైద్య బృందం వెలికితీసింది. శనివారం నిమ్స్ వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం జిల్లాకు చెందిన కుసునూరు లక్ష్మి కొన్ని రోజులుగా కడుపు నొప్పితో బాధపడుతోంది. అయితే ఖమ్మంలో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో స్కానింగ్ చేయించగా హైదరాబాద్కు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. హైదరాబాద్ నిమ్స్ హాస్పిటలో వైద్య పరీక్షలు చేసిన వైద్యులు ఆమె కడుపులో కణితి ఉన్నట్టు గుర్తించి, సజికల్ ఆంకాలజీ హెచ్డీ వైద్యులు ఎస్. రాజశేఖర్ నేతృత్వంలో ఆపరేషన్ చేసి పదిన్నర కిలోల కణితిని వెలికితీశారు. వైద్య బృందంలో డాక్టర్ సాహితి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బషీర్, అనస్తిశ ఫ్యాకల్టీ డాక్టర్ఇంద్రాదేవరాజ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్. పావని, జూనియర్ డాక్టర్ ప్రణవ్, అనస్తిశ టెక్నీషియన్ సుధాకర్,అసిస్టెంట్ నర్స్ జి. ప్రియాంక, థియేటర్ అసిస్టెంట్ కె. కృష్ణ, థియేటర్ బాయ్స్ బి. పవన్, వినోద్ పాల్గొన్నారు.ప్రస్తుతం పేషెంట్ కోల్కొని తనంతట తానే నడుస్తుంది. పేషెంట్ తరపున బంధువులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు.