-డి.వెంకటేశ్వర్లు, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ కు విశేష స్పందన భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ), భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 19,20 తేదీల్లో నిర్వహిస్తున్న మండల స్థాయి టాలెంట్ టెస్ట్ కు 800 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇల్లందు పట్టణ కేంద్రంలో నిర్వహించిన టాలెంట్ టెస్ట్ ప్రారంభ సభకు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుల్లో రాణించాలని, బంగారు భవిష్యత్తుకు 10వ తరగతి తొలిమెట్టు అన్నారు. 10వ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించాలని అన్నారు. ఎస్ఎఫ్ఐ టాలెంట్ టెస్ట్ విద్యార్థులను పరీక్షలకు సన్నద్దం చేసేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. సింగరేణి హైస్కూల్ లో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయగా ఇల్లందు మండల పరిధిలో 800 మంది విద్యార్థులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కాళంగి హరికృష్ణ,ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బయ్యా అభిమన్యు సింగరేణి హై స్కూల్ హెడ్మాస్టర్ వెంకటేశ్వర్లు శ్రీనివాస్ K ప్రవీణ్ నరసింహారావు సౌజన్య సరళ SFI జిల్లా కమిటీ సభ్యులు k కిషన్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.