ఎర్రగడ్డ ప్రభుత్వ మెంటల్ హాస్పిటల్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ కు రెండు నెలల జీతాలు అక్టోబర్, నవంబర్ పనిచేసిన వేతనాలు వెంటనే ఇవ్వాలని ఆస్పటల్ నందు ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాపర్తి అశోక్, సెక్రెటరీ Nసైదయ్య గార్లు మాట్లాడుతూ ఆల్ సర్వీస్ కాంట్రాక్టర్ 8వ తేదీ లోపు ప్రభుత్వ మెంటల్ హాస్పిటల్ పనిచేస్తున్న కార్మికులకు జీతాలు చెల్లించాలని లేనియెడలో ఈనెల 10వ తారీఖు నుండి పని బంద్ చేసి హాస్పిటల్ ముందు నిరసన తెలియజేస్తామని తెలియజేయడం జరిగింది రెండు నెలలు జీతాలు రాక కార్మికులు స్కూల్ ఫీజులు ,ఇంటికి కిరాయిలు కట్టకుంటే ఇంటి యజమాని నుండి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు . కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ప్రకారం నెలకు 12093వ్వాలి కానీ 11000 వేలు మాత్రమే ఇస్తున్నారు. పై సమస్యలు పరిష్కరించలేని ఎడల ఈనెల 10వ తారీఖు నుండి పని బంద్ చేసి నిరసన తెలియజేస్తామని తెలియజేయడం జరిగింది. డిమాండ్స్ 1,ప్రతి నెల 7వ తేదీలోపు జీతం ఇవ్వాలి. 2. జీవో 60 ప్రకారం కట్టింగులు ఫోను నెలకు 12093 ఇవ్వాలి. 3,ఈఎస్ఐ ,పిఎఫ్ అకౌంట్ లో సక్రమంగా జమ చేయాలి. 4,ప్రతి కార్మికునికి రెండు జతల యూనిఫామ్స్ ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో నాయకులు యాసిన్, లింగయ్య ,మల్లేష్, శ్రావణి ,పుష్ప ,లక్ష్మీ, భాగ్యలక్ష్మి, జహీరా తదితరులు పాల్గొన్నారు