
parakala news
గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన పరకాలను అభివృద్ధి పరచాలి
గళం న్యూస్ పరకాల
ఉద్యమ పురిటిగడ్డ పరకాల ఎప్పటినుండో తాలూకా నుండి ఒక చరిత్ర కలిగిన పరకాలను గత పాలకులు పట్టించుకోకుండా నిర్లక్ష్యానికి గురిచేయడంతో నేడు ఒక కుగ్రామంగా మారిందని ,నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డికి పరకాల మాజీ ఎమ్మెల్యే,బిజెపి రాష్ట్ర నాయకులు మొలుగూరి బిక్షపతి బిజెపి నాయకులతో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బిక్షపతి మాట్లాడుతూ.. గత పాలకులు పరకాలను అన్ని రకాల అభివృద్ధికి అడ్డుపడ్డారని మీరు నర్సంపేట అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ఘనత ఉందని అలాంటి వ్యక్తి పరకాల రావడం చాలా సంతోషమని పరకాలను కూడా అన్ని రకాల అభివృద్ధి పరచాలని కోరారు. అసంపూర్తిగా ఉన్న పనులన్నీ పూర్తి చేసి పరకాల ప్రజల ఆకాంక్షల నెరవేర్చాలని కోరారు. ఉద్యమ వీరుల పొరుగడ్డ పరకాలను అమరవీరుల జిల్లా చేసేందుకు కృషి చేయాలని కోరారు. దీనిపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ ప్రతిపక్షాల సహాయ సహకారాలతోని పరకాలను తమ వంతుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమములో రాష్ట్ర నాయకులు దేవునోరి మెగనాధ్ ,మేకల రాజావీర్, పట్టణ అధ్యక్షుడు మార్త బిక్షపతి ,కౌన్సిల ర్ కొలనుపాక బద్రయ్యా ,బెజ్జెంకి పూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు.