
ఈ69న్యూస్ జనగామ జిల్లా అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ ప్రజలకు పిలుపునిస్తూ,పరిశుభ్రత కోసం వారంలో ఒక రోజు అయినా ఒక గంట శ్రమదానం చేస్తే అది మీ ఇంటి,మీ వాడా,మీ ఆరోగ్యానికి సోపానం అవుతుంది”అన్నారు.గురువారం జనగామ మండలం శామీర్‌పేట గ్రామంలో స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ కార్యక్రమం అమలులో భాగంగా నిర్వహించిన ఏక్ దిన్-ఏ గంట-ఏక్ సాత్”కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు.గ్రామ ప్రజలతో కలిసి ఆయన ఒక గంట పాటు శ్రమదానంలో పాలుపంచుకున్నారు.అనంతరం మార్కెట్ కమిటీ చైర్మన్ శివరాజ్ యాదవ్ ఏర్పాటు చేసిన స్వచ్ఛ పండాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి,ప్రజలందరితో స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..స్వచ్ఛత పాటించడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని,గ్రామాలను శుభ్రంగా ఉంచడం ద్వారా రోగాలను నివారించవచ్చని”అన్నారు.గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు శాలువాలు కప్పి సన్మానించి,వారికి స్వచ్ఛతాహి సేవ టీ షర్ట్లు,క్యాప్‌లు అందజేశారు.కార్యక్రమానికి జిల్లా పంచాయతీ అధికారి స్వరూప,జిల్లా స్వచ్ఛ భారత్ మిషన్ కోఆర్డినేటర్ కరుణాకర్,జిల్లా అదనపు పీడీ చంద్రశేఖర్,ఎంపీడీవో సంపత్,పంచాయతీ కార్యదర్శి స్వప్న,ఏపీఎం శంకరయ్యతో పాటు గ్రామ ప్రజలు,స్వయం సహాయక సంఘ సభ్యులు తదితరులు హాజరయ్యారు.