పర్యావరణానికి మేలు చేసే మట్టి గణనాధుని పూజిద్దాం
వినాయక చవితిని పురస్కరించుకుని జడ్.పి.హెచ్.ఎస్ కొత్తపల్లి గోరి ఉన్నత పాఠశాలలో పర్యావరణానికి హాని కలగకుండా మట్టి గణనాథులను మూసా సంపత్ ఆధ్వర్యంలో క్రాఫ్ట్ టీచర్ బండారి శైలజ సహకారంతో ఆరవ తరగతి మరియు తొమ్మిదో తరగతి విద్యార్థిని విద్యార్థులు శివ,కమల్నాథ్,నవీన్, జస్వంత్,కన్నయ్య,రసజ్ఞ, రిషిత,మనోజ్,హర్షవర్ధన్ గణనాధుని మట్టి విగ్రహాలు తయారు చేయడం జరిగినది.
ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ శ్రీమతి మాధవి లత మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించే పాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను కాక మట్టితో తయారుచేసిన విగ్రహాలను పూజించాలని అలాగే గ్రామంలో అందరూ మట్టి గణనాధులను పూజించే విధంగా విద్యార్థులు ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో మట్టి విగ్రహాలను ఉపాధ్యాయులకు పాఠశాలలోని విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగినది.