
మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలంలో డి ఎస్ రెడ్యా నాయక్, చిన్న గూడూరు మండలంలో పల్లె పల్లెకు మన ఎమ్మెల్యే డి ఎస్ రేడ్యా నాయక్ కార్యక్రమంలో భాగంగా శనివారం విస్సంపెల్లి,తుమ్మలచేర్వు తండ,చిన్న గూడూరు గ్రామ పంచాయతీ కార్యక్రమo పాల్గొన్నారు.డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ గ్రామాల్లో తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం వారి సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాలనలో రాష్టం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళుతోంది అన్నారు.పేదరిక నిర్మూలనకు సీఎం కేసీఆర్ రాష్టంలో ఎన్నో ప్రభుత్వ పథకాలు పెట్టినారని,ఒంటరి మహిళలకు,వికలాంగులకు,వృద్దులకు పింఛన్లు ఇస్తున్నారని అన్నారు.అలాగే రైతులకు రైతు భీమా,రైతు బంధు,24గంటలు ఉచిత కరెంట్,కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిచ్చి మూడు కార్లు పంటలు పండించుకునెలా నీటిని అందిస్తూ రైతును రాజును చేసే దిశగా ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.అలాగే పేదింటి ఇంటిలో పెండ్లి జరిగితే పెద్దన్నలా కల్యాణలక్ష్మి,శాధిముభారాఖ్ పథకంతో లక్ష నూట పదహార్లు ఇస్తూ,ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు చేసుకుంటే ఆడబిడ్డకు జన్మనిస్తే పదమూడు వెయిల రూపాయలు,మగబిడ్డకు జన్మనిస్తే పన్నెండు వేయిలా రూపాయలు ఇస్తూ,కేసీఆర్ కిట్టు ఇస్తూ,కిట్టులో పాపకు కావలసిన వస్తువులతో కూడిన ప్యాకేజీతో ఇస్తున్నారని గుర్తుచేశారు.అలాగే ఇంకా కొన్ని పనులు మిగిలి ఉన్నాయని,రోడ్డు పనులు,అంతర్గత సిసి రోడ్లు,డబుల్ బెడ్రూంలు,దళిత భందు,బిసి బంధు లాంటి పథకాలు ఇంకా రానివారికి వచ్చేలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న గూడూరు మండల ఎంపీపీ వల్లూరి పద్మ వెంకట్ రెడ్డి . జెడ్పిటిసి మూల సునీత మురళీధర్ రెడ్డి, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మంగపతి రావు . చిన్న గూడూరు మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్. 10 గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు,మైనారిటీ సోదరులు,ఎస్సీ సెల్ అధ్యక్షులు,ఎస్టీ సెల్ అధ్యక్షులు,బీసీ సెల్ అధ్యక్షులు. మార్కెట్ డైరెక్టర్లు. 10 గ్రామాల యూత్ అధ్యక్షులు,సోషల్ మీడియా అధ్యక్షులు,మహిళా అధ్యక్షులు,మహిళా సంఘాలు,మండల బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులు తదితరులు పాల్గొననున్నారు.