
అహ్మదీయ ముస్లిం బాలికల ఖుర్ఆన్ పఠన ప్రారంభం కార్యక్రమం

ఖుర్ఆన్ చదవడం వలన ఆధ్యాత్మిక చింతనతో పాటు మానసిక ప్రశాంతత ఉత్పన్నమవుతుంది-మౌల్వీ ముహమ్మద్ మీనూ పాషా
ఈ69న్యూస్ అమలాపురం:ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈస్ట్ గోదావరి జిల్లా దొంతికుర్రు గ్రామంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఖుర్ఆన్ బిస్మిల్లా ప్రొరంభం ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఇద్దరు అహ్మదీయ ముస్లిం బాలికలు హిబ్బతుల్ మాలిక్,షేక్ నాగూర్ బి లు ఖుర్ఆన్ అరబ్బి బాషలో చదవడం ప్రారంభించారు.స్థానిక అహ్మదీయ మౌల్వీ ముహమ్మద్ మీను పాషా బాలికలకు ఖుర్ఆన్ బిస్మిల్లాహ్ చదివించారు.అనంతరం మౌల్వీ మీను పాషా మాట్లాడుతూ…పవిత్ర ఖుర్ఆన్ గ్రంధం పవిత్ర రమజాన్ మాసంలో అవతరించిందని ఖుర్ ఆన్ అరబ్బి బాషలో చదవడం ప్రతి ఒక్క ముస్లిం నేర్చుకొని అనువాదం తమ మాత్రు బాషలో చదువాలని అన్నారు.ఖుర్ఆన్ అన్ని మత గ్రంథాల సారాంశం ఖుర్ఆన్ చదవడం వలన ఆధ్యాత్మిక చింతనతో పాటు మానసిక ప్రశాంతత ఉత్పన్నమవుతుందని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు షెక్ మీరా సాబ్ తదితరులు పాల్గొన్నారు.