
సుద్దాల అశోక్ తేజ
పాటలకు ప్రాణమైన తల్లిదండ్రులకు ప్రణామం గా..13 న సుద్దాల పురస్కారాల ప్రదానోత్సవం
——-సుద్దాల అశోక్ తేజ
సుద్దాల జానకమ్మ హనుమంతు సాహితి, జానపద, నృత్య పురస్కారాల ప్రధానోత్సవం ఈ నెల 13న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య కళా నిలయం బాగ్ లింగంపల్లి హైదరాబాదులో అత్యంత ఘనంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా కార్యక్రమ గోడ పత్రం విడుదల చేశారు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో లోని టి పి ఎస్ కే హాల్లో విలేకరుల సమావేశంలో పత్రిక విలేఖరుల సమావేశం లో ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మాట్లాడుతూ.. పురస్కార గ్రహీతలు ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఓల్గా గారికి ప్రముఖ జానపద, సినీ గాయని మధుప్రియ ,ప్రముఖ నర్తకి లాలినిధికి పురస్కారాలు అందజేస్తున్నట్లు తెలిపారు
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జస్టిస్ సూరేపల్లి సునంద తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులు
శ్రీమతి హరిచందన దాసరి ఐఏఎస్ గౌరవ కలెక్టర్ హైదరాబాద్ గారు డాక్టర్ ఎస్ రఘు ప్రొఫెసర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం, సుద్దాల సుధాకర్ తేజ తదితరులు పాల్గొంటారని తెలిపారు సభకు ముందే నాట్య ప్రదర్శనలు నృత్య రూపకాలు చైతన్య కార్యక్రమాలు ఉంటాయని అన్నారు ఈ సందర్భంగా సుద్దాల అశోక్ తేజ గారు మాట్లాడుతూ తెలంగాణ నేల సాలు మీద పాటలతో విత్తనమైన నా తల్లిదండ్రులు జానకమ్మ హనుమంతు నా తండ్రికి మా అమ్మ ఇరువైపులా పాటై..
పాటల పల్లకి పి మోసిందని అన్నారు 13 సంవత్సరాలు నాన్న పేరు మీద ఈ సంవత్సరం అమ్మ పేరు మీద పేరు అమ్మలకు సాహితీ, జానపద, నృత్య ముగ్గురమ్మలకు పురస్కారాలను అందజేస్తున్నానని అన్నారు.
మా తల్లిదండ్రులు పోరు పాటలకు తేనె తీపి నద్ది పల్లె పల్లెన ఉద్యమమై అరుణ పతాకాలను ఎగరవేసిన ప్రజాస్వరము వారిది అని జనంతోనే వారి పాట జనమంతా ఆయన పాట జగమంతా నాన్న పాట జీవితమంతా పోరుబాటే.. అడుగడుగునా సుద్దాలది ముళ్ళబాటే … అందుకే మాది పాటల ఇల్లు పాటలతోనే పెరిగినాను కనుకనే..నా పాటలకు ప్రాణమైన నా తల్లిదండ్రులకు ప్రణామంగా 14 సంవత్సరాలుగా పాట ఆటలకు పురస్కారాలు ప్రధానోత్సవం జరుగుతుంది నా ప్రాణమున్నంత వరకు ప్రతిజ్ఞ లాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తానని అన్నారు పల్లె పల్లెనా సుద్దాల ఆశయాలను ముందుకు తీసుకు పోతానని అన్నారు ఈ సందర్భంగా
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సుద్దాల హనుమంతు పాటలు యుద్ధ ఉద్యమ ఆత్మగౌరవ గీతాలై ఉద్యమాలకు సిద్దం చేస్తూనే ఉన్నాయని అన్నారు. వారి పాటలు ప్రజలకు పోరాట సోయి పెంచి, గరీబోడు ఎక్కడ గాయపడితే అక్కడ గండ దీపమై బయలెల్లి మట్టి మనుషులను తట్టి లేపి ఉద్యమాలకు,సిద్ధం చేసిన సుద్దాల కుటుంబం ,బడుగు బతుకులలో యుద్ధాల ప్రవాస ప్రవాహ వనవాస గానం సుద్దాల హనుమంతు గానం అని అన్నారు .
హనుమంతు పాటలు ఒక అగ్నిపర్వతం సాంస్కృతిక యుద్ద స్వరం ప్రజల మస్తిష్కాలను విప్లవీకరించి వారిని విప్లవ భావాల వైపు సాయుధుల్ని చేసిన ప్రత్యేకత సుద్దాల జానకమ్మ హనుమంతులది అని అన్నారు విప్లవ భావాలు పట్టని వాళ్ళను సైతం సుద్దాల హనుమంతు గొంతుతో పాడితే మత్తడి దుంకినట్లు ఎగిసిపడే తెలంగాణ ఉద్యమ పాటల్ని చూసి సుద్దాల అశోక్ తేజ పెరిగినారని అన్నారు
సుద్దాల లాంటి యుద్ధ కవిని బతికించుకోవాలిగా.. అందుకే ఈ ప్రతిభా పురస్కారాలు సుద్దాల గానం నిరంతర ప్రవాహం
సుద్దాల పాటతో ప్రయాణం సాహితీ జానపద నృత్య ప్రతిభా పురస్కార
సభ ను ఈ నేల 13 న సాయంత్రం 6 గంటలకు సుందరయ్య కళా నిలయం లో జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సుద్దాల సుధాకర్ తేజ, సుద్దాల నిర్మల తెలంగాణ బాలోత్సవం కార్యదర్శి ఎన్ సోమయ్య తదితరులు పోస్టర్ ఆవిష్కరణ సభ పత్రిక విలేఖరుల సమావేశంలో పై విషయాలు ప్రకటించారు