
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు
ఒక మహత్తరమైన సాంఘిక శక్తి అది నియమ బద్దంగా, శాస్త్రీయంగా ప్రవర్థిల్లినట్లయితే పురోగమన భావాలవైపు సాంఘిక చైతన్యంగా పురోగమిస్తుంది లేనిచో చైతన్య హీనమై సనాతన సాంప్రదాయం వైపు చతికిల పడుతుంది. సముద్రం విషపూరితము కానంత వరకే జలచరాల మనుగడ సమాజంలో కూడా “సుసంస్కృతి”ని నేలకోల్పల్సిన బాధ్యత పురోగమన శక్తులదే.. ఈ సమాజంలో.. సహజంగా మానవాళికి రెండు రకాల అవసరాలు ఉంటాయి 1. భౌతికమైనవి. 2. మానసికమైనవి భౌతిక అవసరాలు తీర్చేది ఆర్ధిక రంగం అయితే, మానసిక అవసరాలు తీర్చేది సాంస్కృతిక రంగం. మొదటిది పునాది రెండవది ఉపరితలం అంటే పునాది కీలకం అయితే పునాది ఆధారంగానే ఉపరితలం ఏర్పడుతుందని ఎంత నిజమో.. ఆ పునాది ఉపరితలం చేత ప్రభావితమవుతూ పరిణామం చెందుతుంది. ఆర్థికరంగంలో కృషికి, సమాంతరంగా సాంస్కృతిక రంగంలో కృషి కూడా సాగాల్సిందే సాంస్కృతిక రంగంలో పురోగామి శక్తుల జోక్యం నేడు తగినంతగా లేకపోవడం మూలంగానే తిరోగమనశక్తుల జోక్యం తిరుగులేనిదిగా యదేచ్ఛగా సాగుతోంది. ఇటీవలే చిలుకూరు బాలాజీ దేవాలయపూజారిపై దాడి, కలంపై దాడి, గళంపై దాడి, అక్షరంపై దాడి అడుగడుగున, అన్ని స్రవంతుల్లో మతోన్మాదమే రాజ్యమేలుతు.. నియంతృత్వం అమలు జరుగుతున్నది. అసహనం బుసలు కొడుతోంది. ప్రశ్న పైన పగ, సాధించుకున్న సామరస్యం చెరిపేసే ఉన్మాదం, సడలుతున్న సామరస్యం తిరిగి బిగించే చాందసం. మహనీయులు సృష్టించిన అద్భుత సంప్రదాయాలను ఆధునిక విలువలను కబళించడం, ఆడ పిల్లల జీవన సరళికి లక్ష్మణ రేఖలు గీయడం. నేటి యువతలో అలుముకుంటున్న చిమ్మ చీకటిలో.. ప్రశ్న బతికి బట్ట కట్టాలంటే ఒక మహా ప్రయత్నమే జరగాలి. ఈ స్థితిని జయించాలంటే ప్రజలలో ముఖ్యంగా యువతి, యువకులలో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించడం ఒక్కటే మార్గం సాంస్కృతిక చైతన్యము లేని ఏ జాతి పురోగమించలేదు సరి కదా ఎంతో కాలం మన లేదు ఒక దేశం వెనుకబడటం లేదా ముందుకెళ్లడం అనేది ఆ ప్రజల సాంస్కృతిక చైతన్యం, శాస్త్రీయ విజ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. మానవ జీవితాలను ముందుకు నడిపించే జ్ఞానమే సంస్కృతి ఈ జ్ఞానమే లేనప్పుడు మూఢనమ్మకాలు అశాంతి అన్యాయాలు పుణ్యం పాపం స్వర్గం నరకం కర్మ రాత ఇవే ముందుకు తెస్తున్నారు. క్రమశిక్షణ రాహిత్యం వల్లనే కుంభమేళాలో వందలాది మంది చనిపోయిన వాళ్లంతా స్వర్గానికి పోయారు అని ప్రచారం చేస్తున్న.. ప్రశ్నించలేని స్థితిలో పౌర సమాజం ఉంది. దేశంలో అలుముకుంటున్న ఒక తీవ్ర జాతీయ వాద నిరంకుశ వాతావరణాన్ని ఏదో ఒక స్థాయిలో నిలువరించే సువిశాల వేదిక ఏదైనా ఏర్పడితే.. బాగుండును అనుకుంటున్న తరుణంలో తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం (టిపిఎస్కే) సుద్దాల హనుమంతు సాంస్కృతిక ఉత్సవాలు పండుగ సాయన్న మీర సాయబ్ దున్న ఇద్దస్, సురవరం లాంటి వీరుల గడ్డ మహబూబ్ నగర్ పట్టణంలో ఫిబ్రవరి 5, 6 రెండు రోజుల పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది
ఏక కాలంలో భారత రాజ్యాంగం సమర్థించిన ప్రధాన సూత్రాలైన ప్రజాస్వామ్య సౌర్వభౌమ గణతంత్ర స్వేచ్ఛ సమానత్వం పేర్లతో నాలుగు వేధిక లు 26 కళాశాల నుండి 1200 మంది యంగ్ తరంగాలలో నిద్రాణమై ఉండే కళాభిరుచిని సాంస్కృతిక కోణాన్ని జాగృతం చేసింది. కదలిక లేని యువతరాన్ని తట్టి లేపింది. పరిక్షలకు పదినిమిషాలుండగా కూడా వేదికపై ఆడి పాడి పరిక్షలు రాసి మానసికోల్లాసంతో తమ ప్రతిభను చాటుకున్నారు. ఆట పాటలు చదువు కు అడ్డుకాదని నిరూపించారు. జానపద సాహిత్యం ద్వారా జాతి సంస్కృతిని తెలిపారు. వీరులచరిత్రను, ధిక్కార వారసత్వాన్ని కాపాడుకోవాలని సాంస్కృతిక కార్యక్రమాలు ద్వారా గుర్తు చేశారు. సహేతుకమైన సత్యాలను కళారూపాల్లో వాగ్దానం చేశారు. తెలంగాణ భూమి పండిన “పంట పొలం” వంటిది. ఇక్కడ ఎన్నో రకాల జానపద కళలు తెలుగు నేలను సుసంపన్నము చేశాయి. పట్టణ ప్రజలను కట్టిపడేసే కళారూపాలను ప్రదర్శించారు. గిరిజనుల నృత్యాలు సహజ విజ్ఞాన నిధి పరం పరాను గతంగా శతాబ్దాల తరబడి వారసత్వంగా నల్లమల వెంట క్రిష్ణానదిలా ప్రవహిస్తున్న సజీవ స్రవంతిలా ఉన్నాయి. నర సరాలలో నాటుకుపోయిన అభినయం వీక్షకులను అబ్బుర పరిచాయి. శాంతి సామరస్యం ఐక్యత సృజనాత్మకత సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ఆఫ్రికా ఖండం నుండి నమిభియా దేశ ఆరోగ్య శాఖ మంత్రి బెర్నాడ్ స్థానిక యం. ఎల్. ఏ. సుద్దాల అశోక్ తేజ పుర ప్రముఖులు హాజరై తిలకించారు. ఉర్దూ పాఠశాల విద్యార్థినులు స్వయంగా రాసి ప్రదర్శించిన లఘనాటిక ‘ఊడలు దిగిన వికృత సంస్కృతి’ ఈ నాటికలో దేశాలకు సరిహద్దులుంటాయి, ప్రపంచ ప్రజల మధ్య అసమానతలున్నాయి, విశ్వ మానవాళి ఇంటర్ నెటికి ఏ హద్దుల్లేపు అంతర్జాలాన్ని ముంచెత్తుతున్న అశ్లీల దృశ్యల సడుపు బాల్యం బాధాకరంగా మారిందని మొబైల్ కు “భై” చెప్పి, పుస్తకాలకు “హాయ్” చెప్పి చక్కటి సందేశాన్ని ఇచ్చారు. మరోవైపు ” నేనెప్పుడూ రాజ్యానికి ప్రతిపక్షమే” అంటూ కవులు, కవయిత్రులు కవి సమ్మేళనం నిర్వహించారు. చిత్రకారులు ” మెమంతా ఒక్కటే ” అంటూ దేశ సమైక్యత చిత్రాలు గీసారు. శాస్త్రీయ నృత్యాలు, బతుకమ్మ, కోలాటం, లఘు నాటికలు, భజన, జానపద కళారూపాలు, తీరొక్క వేషాలు, సాహిత్య, సాంస్కృతికంగా కోలాహలంగా.. గుంపులు గుంపులుగా తరలి వచ్చారు. సుద్దాల వేదిక అంటే నే పాటల యుద్ధాల, ప్రగతిశీల ప్రభాత దృక్పథాన్ని ప్రతిబింబించాయి. మైనారిటీ పిల్లలు ఆదివాసీ గిరిజన విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు. విదేశీ సంస్కృతి అనగానే..? చెత్త అని స్వదేశీ సంస్కృతి అంతా బంగారమని అలాంటి వివాదాలకు పోకుండా విదేశీ, స్వదేశీ అనేవి కలగలిసిపోయాయి. వాటి వర్గసారాన్ని బట్టి మన వైఖరి ఉండాలని బ్రేక్ డాన్స్, వెస్ట్రన్ డాన్స్ పాప్ సంగీతం, భరతనాట్యం, శాస్త్రీయ సంగీతం అన్ని రూపాలను ప్రజలకు చక్కటి సందేశాన్ని అందించే భావజాలంతో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. సమానత్వ అవగాహనను శక్తి వంతంగా చూయించారు. ప్రత్యామ్నాయ భావజాలాన్ని బలంగా చెప్పారు. లౌకిక భావాలు, ప్రజాస్వామిక విలువలు, సామాజిక వివక్షలు పురుషాధిక్య భావాజాలంలో, ముడిబడ్డ సమస్యలు, వినిమయ తత్వం, వ్యక్తి వాదంతో వచ్చే పర్యావసానాల వంటి అంశాలను కళారూపాలలో వ్యక్తం అయ్యాయి. భావ సారూప్యత గలిగిన వ్యక్తులు, అనేక సంస్థలు కలగలిసిన కార్యక్రమమే ఇది. ఇంటర్, డిగ్రీ, పిజి విద్యార్థులు రాబోవు యుగం దూతలు నేటి తరం యువకులు సమస్త అవలక్షణాల నుండి ఆజాదీని కోరుకుంటున్నారు. పడగలు విప్పి మనల్ని కాటేయబోతున్న వ్యాపార విద్య సంస్కృతిని సహించలేకపోతున్నారు.
“ఆట పాటలు సమాజంలో మంచి, చెడ్డల విచక్షణ విప్పి చెప్పే ఆయుధాలు వాటిని ధరించిన యువకులతో అడుగులు కలుపడమే నేటి ప్రత్యామ్నాయం, సుద్దాల సాంస్కృతిక ఉత్సవాలు ప్రశ్నించే దైర్యాన్ని ఇచ్చినవి. ప్రజా సంస్కృతిని పాదుకొల్పుతూ.. ఇవి ఊరురా ఇలాంటి ఉత్సవాలు నిరంతరం నిర్వహించాలి. మనువాద సాహిత్యం ఎక్కడ జడలు విప్పుతుందో.. నిజమైన సాహిత్యం ప్రజాసంస్కృతి పని ప్రారంభమవ్వాలి. ఫాసిస్టు ఆదిపత్య కాలంలో ప్రజల సామాజిక మానసికతను మనం గెలుచుకోవాలి. నేటి యువత కొత్త జీవన దారులను వెతుక్కుంటుంది. సాంస్కృతిక సాహిత్యంలోని వెలుగులకు పునాదిశక్తిగా ఉంటుంది. విధ్వంసకర శక్తుల ఓటమిని సైతం కోరుకుంటుంది. యువజనుల కలయికలో కలవరం వుంది. ఏదో వాళ్ల సాంస్కృతిక పోరాటంలో న్యాయం ఉంది. ప్రతి పాటలో నైతికత ప్రకటన ఉంది. ఈ విషయాలన్ని సాంస్కృతిక ఉద్యమాలు గుర్తించాలి. వాళ్ల సృజనకు తగిన వేదికలు కల్పించాలి. ప్రజలను సాంస్కృతిక పై కప్పు కిందకు తీసుకురావాలి. ఇక చీకటి యుగం ముగుస్తుంది. పోరాడే వారు గెలుస్తారు అనే భరోసా పడి లేచే పాపకున్నంత ఆత్మవిశ్వాసం వాళ్లలో కల్పించింది.. ఇది ఒక మంచి అనుభవం. అలుముకుంటున్న చిమ్మ చీకట్లో ప్రశ్న బతికి బట్ట కట్టాలంటే ..? సాంస్కృతిక రంగంలో మహా ప్రయత్నాలు ముమ్మరం కావాలి. మనలో మనం కలయించు కోవడం కాదు. మనకు పెద్ద శత్రువు ఎవ్వరో తెలుసు కాదా! దాని మీద మనమెందుకు దృష్టి పెట్టకూడదు. అన్ని ప్రజా సంఘాలు సాంస్కృతిక రంగం ఏజెండను ఎత్తుకుని ముందుకు సాగాలి.
9490098343 తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం రాష్ట్ర అధ్యక్షుడు భూపతి వెంకటేశ్వర్లు