
veleru news local news telugu ga;lam news e69news daily news toady news sation ghanpur news
గళం న్యూస్ వేలేరు స్టేషన్ గన్పూర్ నియోజక వర్గంలోని వేలేరు మండల కేంద్రంలోని పాఠశాల ఆవరణ రాజకీయాలకు అడ్డాగా మారింది.గతంలో ఎంపిడిఓ ఆఫీస్ మరియు నర్సరి ఏర్పాటుతో బడిలో పిల్లలను చేర్పించాలి అంటేనే పిల్లల తల్లతండ్రులు జంకుతున్నారని వెంటనే తీసివేయాలని చెప్పినా పట్టించుకోకుండా గత పాలకులు అలాగే కొనసాగించారు.అంతేకాకుండా పిల్లలకోసం ఏర్పాటు చేసిన మూత్రశాలలను ఆఫీసులకు వచ్చిన అధికారులు మరియు బయటి వ్యక్తులు వాడుకుంటున్నారు. ఇదే అదునుగా ఈ యొక్క పాఠశాలలోనే క్రీడాప్రాంగణం ఏర్పాటు చేశారు.దీనికి తోడు బ్యాంకుకు వచ్చే జనం మరియు అధికారులు వారియొక్క వెహికిల్స్ ను స్కూల్లో పార్కింగ్ చేస్తున్నారు.ఇటివల ఒక ఆటో అందులో పార్కింగ్ చేయగా పిల్లలు బంతితో ఆడుకుంటుండగా ఆ బంతి తగిలి ఆటో అద్దం పగలగా ముక్కుపిండి అద్యాపకుల నుండి 4వేల రూపాయలు ఆటో యజమాని వసూలు చేశారు.ఇకనైనా ఇట్టి విషయాలపై పటిష్టమైన చర్యలు భద్రత ఇవ్వాలని ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉపసర్పంచ్ సద్దాంహుస్సేన్ కోరారు.కార్యక్రమంలో ఎస్ఎమ్ఎస్ చైర్మన్ గుండు సాంబరాజు సలీంమాలిక్ శ్రీకాంత్ అద్యాపకులు పాల్గొన్నారు.