
jangaon news loal news telugu news telugu galam news milk news aiks news
అవినీతికి అడ్డాగా మారిన జనగామ పాలడైరీ
తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్యా చందు నాయక్ డిమాండ్
జనగామ: పాడి రైతుల పెండింగ్లో ఉన్న రెండు మూడు పాల బిల్లులను తక్షణమే చెల్లించి ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా లీటర్కు 5 రూపాయల ఇన్సెంటివ్ 2021 మార్చి నుండి నేటి వరకు ఉన్న నిధులను తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు
జనగామ జిల్లా కేంద్రంలో ప్రజాసంఘాల కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా భూక్యా చందు నాయక్ మాట్లాడుతూ
రాష్ట్రంలో 26.82 లక్షల కుటుంబాలు ప శుపోషణపై ఆధారపడి జివరోపాధి పొందుతున్నాయి. జనగామ జిల్లా రాష్ట్రంలో అత్యధికంగా పాల్ సేకరిస్తున్న జిల్లాగా ఉన్నదని కానీ విజయ డైయిరీకి పాలు పోస్తున్న రైతులకు 2,3 దఫాల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ బిల్లులను తక్షణం చెల్లించాలని కోరుతున్నాము. పాడి రైతులకు పెట్టుబడి, పశుపోషణ, దాణా ఖర్చులు విపరీతంగా పెరిగాయి. కొన్ని ప్రైవేటు కంపెనీలతో పాల డైరీ చైర్మన్ అదేవిధంగా డి డి నాసిరకం దానాలు మినరల్ మెచ్యూర్ తెప్పిస్తున్నారని అన్నారు అదేవిధంగా పాల కేంద్రం నుండి సేకరిస్తున్న పాల వెన్న శాతం ఒకటి ఉంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అందులో ఎన్ని శాతం తగ్గించి పాలలో నీళ్లు ఎక్కువ కలిపి అధికారులు అవినీతికి పాల్పడుతూ రైతులకు మాత్రం మొండి చేయి చూపుతున్నారని విమర్శించారు రాష్ట్రంలో పాల త్పత్తిని పెంచడానికి పాడి రైతులను పొత్సహించటానికి లీటర్కు రూ.5 ఇన్సెంటివ్ (ప్రోత్సాహం) ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చింది. గత ప్రభుత్వం ఇవ్వాల్సి ప్రోత్సాహకం 2021 జనవరి నుండి. ఇప్పటి వరకు పెండింగ్లోనే ఉన్నాయి. డబ్బులు ఇవ్వకపోవడం వలన గ్రామాలలో రైతులు ప్రైవేట్ నెయిరీలను ఆశ్రయిస్తున్నారు. విజయ డెయిరీకి వేలాది లీటర్లు పాలు ఇటీవల తగ్గాయి.
పాడి రైతుల పెండింగ్ బిల్లులు తక్షణం చెల్లించాలనీ ప్రోత్సాహంను రూ.5 పెండింగ్ వాటితో కలిపి చెల్లించాలనీ కర్ణాటక, కేరళ తరహాలో సాంకేతిక సేవలు అందించాలి.పాడి పశువులకు బీమా సౌకర్యం ఉచితంగా కల్పించాలి.పాడి రైతులకు బీమా సౌకర్యం, ప్రమాదబీమాకు రూ.10 లక్షల సౌకర్యం కల్పించాలి. రైతులకు బ్యాంకు రుణ సదుపాయం కల్పించాలి.పాడి రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు వేయాలి.
డెయిరీ నుండి వచ్చే లాభాలను రైతులకు పంచాలి.ఒకే ప్రదేశంలో ఎక్కువ సంవత్సరాల నుండి పని చేస్తున్న సిబ్బందిని ట్రాన్స్ఫర్ చేయాలనీ అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు మాచర్ల సారయ్య సహాయ కార్యదర్శి రామావత్ మీట్యా నాయక్ జిల్లా కమిటీ సభ్యులు రవీందర్ రెడ్డి గండి అంజయ్య మోకు భవాని బొట్టు శివ రామచోక్రం యాకయ్య తదితరులు పాల్గొన్నారు