
పిఆర్టీయూ మరిపెడ మండల అధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి
సెప్టెంబర్ 1 2004 తర్వాత నియమితులైన ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ పాత పెన్షన్ విధానం కొనసాగించాలని పిఆర్టీయూ మరిపెడ మండల శాఖ అధ్యక్షులు కీసర రమేష్ రెడ్డి అన్నారు.రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినాన్ని పాటించి మండలంలో వివిధ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పెన్షన్ విధానం కొనసాగించే విధంగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని వారు కోరారు.2004 తర్వాత నియమితులై ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులకు పెన్షన్ ఆసరా పెన్షన్ కంటే తక్కువగా ఉందని అన్నారు.సుదీర్ఘకాలంగా ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి పదవివిరమణ పొందిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ మరిపెడ మండల శాఖ ప్రధాన కార్యదర్శి లింగాల మహేష్ గౌడ్ పిఆర్టీయూ బాధ్యులు దోమల లింగన్న,బాయగాని రామ్మోహన్,హరి, వెంకన్న ,శ్రీను,బాలు,సురేష్,రాజకుమారి,లలిత తదితరులు పాల్గొన్నారు.