పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి
Suryapetప్రభుత్వం నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని టిపిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ బిక్షం, టీఎస్ యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్నారు.జులై 23న హైదరాబాదులో జరిగే రాష్ట్ర స్థాయి సదస్సును విజయవంతం చేయాలని కోదాడ పట్టణంలోని బాయ్స్ హై స్కూల్ శనివారం జాయింట్ యాక్షన్ ఫర్ రెస్టోరేషన్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కమిటీ కోదాడ డివిజన్ ఆధ్వర్యంలో భాగస్వామ్య ఉపాధ్యాయ సంఘాలు టీఎస్ యుటిఎఫ్, టి పి టి ఎఫ్ సంఘాలతో కలిసి కోదాడ పట్నంలో గోడ పత్రికను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ అమలుకై దేశవ్యాప్తంగా కార్యక్రమం చేపట్టడం జరిగిందని అందులో భాగంగానే ఈనెల 23న జరిగే సదస్సుకు ఎక్కువమంది ఉద్యోగ, ఉపాధ్యాయులు హాజరై సదస్సును విజంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌర స్పందన వేదిక ఉపాధ్యక్షురాలు కే ఏ మంగ,టి పి టి ఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ రామ నరసయ్య,నాయకులు నాగేశ్వరరావు, శ్రీదేవి,బి. సైదులు,పిచ్చమ్మ,హనుమంతరావు, మండవ ఉపేందర్,సుధాకర్, ఆంజనేయులు, శ్రీనివాస్, మోతిలాల్, బుచ్చయ్య, బాలరాజు, సతీష్ తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.