ఈ 69 న్యూస్:-హన్మకొండ జిల్లా ఐనవోలు ప్రాంతంలోని పాథ్ ఫైండర్ పాఠశాల పదవ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణతతో గొప్ప విజయాన్ని సాధించింది.మొత్తం 31 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరై అందరూ ఉత్తీర్ణులయ్యారు.ఆర్.జ్యోతి 572,ఈ.అక్షిత 567,జి.సంజయ్ 563 మార్కులతో టాపర్లుగా నిలిచారు.13 మంది 500కి పైగా మార్కులు సాధించటం విశేషం.ఈ విజయానికి ఉపాధ్యాయుల,తల్లిదండ్రుల ప్రోత్సాహమే కారణమని యాజమాన్యం తెలిపింది.