: డివైఎఫ్ఐహనుమకొండ: నగరంలో ప్రధాన కూడల వద్ద నిర్వహించబడుతున్న పానీపూరి, చాట్ బండారు కేంద్రాలపై ప్రభుత్వం తనిఖీలు నిర్వహించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దోగ్గెల తిరుపతి డిమాండ్ చేశారు.డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో హనుమకొండలోని పానీపూరి సెంటర్లను సందర్శించడం జరిగింది.ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడారు.. పానీపూరి బండ్ల వద్ద శుభ్రత పాటించడం లేదని, దీంతో అవి తిన్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, ఇప్పటికే పని ఊరుతున్న వారికి టైఫాయిడ్ జ్వరం వస్తుందని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు చెప్పినప్పటికీ జిల్లాలో ఉన్న అధికారులు వాటి నిర్వాణపై పర్యవేక్షణ చేయకపోవడం, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు ఇక్కడ పానీ పూరి సెంటర్లను నిర్వహించడంతో, దాన్ని తయారు చేయడంలో చూసి శుభ్రత పాటించడం లేదని, అందులో వాడే నీరు కలుషితం కావడంతో కావడంతో, డ్రైనేజీ కాలువల పక్కన, పెట్టడంతో అందులో ఉన్న దోమలు, దుర్వాసన చేరుతుందని, పానీపూరి సెంటర్ లపై ప్రభుత్వము ,ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి పెట్టి తనిఖీలు నిర్వహించాలని ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాలని కోరారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు వల్లెపు లక్ష్మణ్, ఓర్సు చిరంజీవి, మాటూరు సతీష్ ,రమేష్, శ్రీకాంత్,రాజు లు పాల్గొన్నారు.