
పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలి
మున్సిపాలిటీ పరిధిలో వాహనదారులకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలి. అని ఆమ్ ఆద్మీ పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్వీనర్ నాగుల అరవింద్ అన్నారు. నిత్యం ఏదో వస్తువు కోసం కొనుగోలు చేయడం కోసం. షాప్ కు వస్తూ పోతూ ఉంటారు ప్రజానీకం. దుకాణం ముందు పార్కింగ్ చేస్తే ట్రాఫిక్ సిబ్బంది ఫోటో కొట్టి చలానా వేస్తూ వాహనదారుల తీవ్ర ఇబ్బంది గురి చేస్తున్నారు.అని జయశంకర్ విగ్రహం నుంచి గణేష్ చౌక వర్కు కూడా నిత్యం వ్యాపార లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. కావున వెంటనే పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసి ట్రాఫిక్ సమస్య లేకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అన్నారు. వెంటనే పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన విభాగం జిల్లా ఇంచార్జ్ కొండ్ర సాయి తేజ ఆప్ నాయకుడు సాయి తదితరులు పాల్గొన్నారు.