
పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.పరకాల నియోజకవర్గంలో 70 మందికి ఈ చెక్కులు అందించడం జరిగింది.
20 లక్షల 50 వేల రూపాయలు ఈరోజు అందించబోతున్నామని అన్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు 6 కోట్ల 49 లక్షల 20వేల రూపాయలు ఈ సహాయ నిధికి అందించిందని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గర్వపడ్డారు. అలాగే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందని ఎమ్మెల్యే అన్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో రెండు హామీలు ఇచ్చారు.ఒకటి విద్య,రెండవది వైద్యం అని అన్నారు. ఆరోగ్యశ్రీ వచ్చిందంటే ఎంతో కొంత మన కుటుంబాన్ని ఆదుకుంటుందని అన్నారు.అలాగే సీఎంఆర్ఎఫ్ మరియు కళ్యాణ లక్ష్మికి ఇప్పటి వరకు 29 కోట్ల 9 లక్షల 65వేలు ఖర్చు చేసిందన్నారు. విద్యా విషయంలో ముఖ్యమంత్రి శ్రద్ధ తీసుకుంటున్నారు మనం ఇదివరకు చూస్తే హాస్టల్స్ పశువుల కొట్టాలాగా ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు మనం వచ్చాక వాటి శుభ్రపరిచి డైట్ చార్జెస్ పెంచి మంచి నాణ్యమైన భోజనాన్ని వాళ్ళకు అందిస్తూన్నామని అన్నారు.ఈరోజు మన నియోజకవర్గానికి 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తొందరలోనే వర్షాలు తగ్గగానే ఆ పనులు కూడా ప్రారంభిస్తామని ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు