పార్టీ ప్రతిష్టతకు కృషి చేయాలి
Jangaonమార్కెట్ కమిటీ చైర్మన్ గుజ్జరి రాజు
జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలోని షాపల్లి, తమ్మడపల్లి జి గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర తొలి ఉపముఖ్యమంత్రి డా తాటికొండ రాజయ్య గారి ఆదేశానుసారం గ్రామశాఖ అధ్యక్షులు కొడారి కుమార్, మారపల్లి కుమార్ గార్ల ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించగా ఈ సమావేశాలకు ముఖ్య అతిథిగా స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ & క్లస్టర్ ఇంఛార్జ్ గుజ్జరి రాజు గారు హాజరయ్యారు. వారు మాట్లాడుతూ…. టీఆర్ఎస్(బిఆర్ఎస్) పార్టీ పటిష్టత కోసం నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో కృషి చేయాలనీ కోరారు. అదే విధంగా ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ వైభవం కోసం ప్రతీ కార్యకర్త పాటుపడాలని సూచించారు.తదుపరి తాటికొండ రాజన్న గారి ఆదేశానుసారం బూత్ ఇంచార్జ్ లను నియమించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీటిసిల ఫోరమ్ మండల అధ్యక్షుడు చిలువేరు శివయ్య, మండల పార్టీ ఉపాధ్యక్షుడు రాపర్తి రాజ్ కుమార్, తమ్మడపల్లి జీ గ్రామ రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ గద్ద కొమురయ్య గార్లు క్లస్టర్ కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.