పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మాజీ ఎంపీటీసీ
హనుమకొండ జిల్లా అయినవోలు మండలం కేంద్రంలో బుర్ర సతీష్ నాన్నమ్మ, బుర్ర లక్ష్మి అనారోగ్యంతో మృతి చెందిరి. ఎమ్మెల్యే, కె.ఆర్. నాగరాజు ఆదేశాల మేరకు కాంటెస్ట్ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ బొల్లెపల్లి మధు గౌడ్ మృతదేహాన్ని సందర్శించి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ మాజీ చైర్మన్ మునిగల సమ్మె గౌడ సంఘం అధ్యక్షుడు నకరికంటి సమ్మయ్య గౌడ్ సంఘం మాజీ అధ్యక్షుడు కోట నరసయ్య గౌడ్ సంఘం సభ్యులు బొల్లెపల్లి పరమేష్ గౌడ్ అయినవోలు కాంగ్రెస్ పార్టీ మండల సేవాదళ్ అధ్యక్షుడు రహీమ్ ఖాన్ మండల యూత్ వైస్ ప్రెసిడెంట్ కొండేటి దిలీప్ మండల నాయకులు బొల్లెపల్లి రఘువర్మ ఇందిరమ్మ కమిటీ సభ్యుడు గడ్డం మురళి పులి సాగర్ బొల్లెపల్లి తిరుపతి యూత్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.