
warangal news pedamarthi ravi news
మారపాక రవితో సమావేశమైన రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మెన్ పిడమర్తి రవి
జనగామ జిల్లా జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి ఇంటిని
రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మెన్,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పిడమర్తి రవి సందర్శించారు.ఈ సందర్భంగా ఇరువురు సమావేశమై రానున్న పార్లమెంటు ఎన్నికల్లో మాదిగలకు ఎంపీ సీట్లను కేటాయించాలనే అంశంపై చర్చించుకున్నారు.రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు కలిగి ఉన్న మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత కల్పించాలని త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కల్వనున్నట్లు వారు తెలిపారు.రానున్న రోజుల్లో మాదిగలు రాజకీయంగా ఎదిగాల్సిన అవసరం ఉందన్నారు.సీఎం రేవంత్ రెడ్డి మాదిగలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించే దిశగా ఆలోచిస్తున్నారని తెలిపారు.పార్లమెంట్ ఎన్నికల్లో మాదిగల అస్తిత్వాన్ని చాటే విధంగా మాదిగలు ఐక్యంగా ఉండి మన అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు.కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి గుర్రం యాదగిరి,తీగల మహేందర్ అనంతపురం కమలేష్ తదితరులు పాల్గొన్నారు.